వన్ డే ఆఫర్: టీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంపు వాయిదా

వన్ డే ఆఫర్: టీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంపు వాయిదా

టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి వస్తూనే ఛార్జీల పెంపు అంశాన్ని చంకనబెట్టుకువచ్చారు ఆర్మీసీ కార్మికులు. డిసెంబరు 2నుంచి వీటిని వసూలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకో రోజుకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా ఛార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

ఆ తేదీని మారుస్తూ.. డిసెంబరు 3కు వాయిదా వేశారు. టికెట్ యంత్రాల్లో మార్పులు చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఛార్జీల ఆధారంగా పట్టికను తయారుచేసి సోమవారం విడుదల చేయనున్నారు అధికారులు. 

ఆదివారం కార్మికులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘ఆర్టీసీ సంస్థలో ఇక యూనియన్ ఉండదు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం ప్రయత్నాలు చేయాలి. ఒక రెండు సంవత్సరాలు యూనియన్ లేకుండా పెట్టుకుందాం. మంచిగా ఉంటే..ఇదే కంటిన్యూ చేద్దాం. రాకపోతే..యూనియన్ ‌లోకి వెళుదామన్నారు కేసీఆర్. ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకుని ప్రతి డిపోకు ఇద్దరు కార్మికులు ఉండే విధంగా చూసుకోవాలని రాష్ట్ర స్థాయిలో ఓ వ్యక్తి ఉండి.. సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.