లాక్ డౌన్ కారణంగా టీవీ నటుడు ఆత్మహత్య

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న వారిలో సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా చాలామందే ఉన్నారు.

సినిమా షూటింగ్ లు ఉన్న సమయంలో ఎలాగోలా గడిచిన చిన్న స్థాయి ఆర్టిస్టుల జీవితం..ఇప్పుడు కెమెరాల స్విచ్చ్ లు ఆగడిపోవడంతో కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ టీవీ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదత్ సే మజ్బూర్ మరియు కుల్దీపక్ వంటి షోస్ లో కనిపించిన టీవీ యాక్టర్ మన్మీత్ గ్రీవాల్(32) ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఏరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న మన్మీత్..శుక్రవారం రాత్రి నేవీ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. లౌక్ డౌన్ కారణంగా లోన్ లు చెల్లించలేక ఆర్థిక కష్టాలను ఎదుర్కుంటూ కొన్ని రోజులుగా మన్మీత్  తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

బెడ్ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించిన మన్మీత్ ను చూసిన ఆయన భార్య షాక్ కు గురై,సృహ తప్పి పడిపోయిందని మన్మీత్ సన్నిహితులు తెలిపారు. పంజాబ్ కు చెందిన మన్మీత్…లాక్ డౌన్ కు ముందు వెబ్ సిరీస్ లు,కొన్ని కమర్షియల్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నట్లు సమాచారం. బెడ్ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించిన మన్మీత్ ను చూసిన ఆయన భార్య షాక్ కు గురై,సృహ తప్పి పడిపోయిందని మన్మీత్ సన్నిహితులు తెలిపారు.

Read Here>> నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే : పవర్ స్టార్ పై ప్రగ్యా ప్రశంసలు