Whatsapp : అయ్యా మస్క్.. వాట్సాప్ కూడా కొనండయ్యా.. 10 డాలర్లు ఫీజు పెట్టండయ్యా.. గ్రూపుల గోల ఉండదు..!

Whatsapp : ట్విట్టర్ ఇప్పుడు బిలియనీర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎప్పటినుంచో ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనేందుకు ప్లాన్ చేస్తూ వచ్చారు. చివరికి ఎట్టకేలకు మస్క్ ట్విట్టర చేజిక్కించుకున్నారు. అప్పటినుంచి సోషల్‌ మీడియాలో మస్క్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Twitter Users Jokes on Whatsapp for Group Fees on Groups, Elon Musk Should Buy

Whatsapp : ట్విట్టర్ ఇప్పుడు బిలియనీర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎప్పటినుంచో ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనేందుకు ప్లాన్ చేస్తూ వచ్చారు. చివరికి ఎట్టకేలకు మస్క్ ట్విట్టర చేజిక్కించుకున్నారు. అప్పటినుంచి సోషల్‌ మీడియాలో మస్క్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఏదోలా ట్విట్టర్ కొనేశారు.. ఇక మెటా కంపెనీ సొంత యాప్ అయిన వాట్సాప్‌ (Whatsapp)ను కూడా కొనేయండి అంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విట్టర్ మాదిరిగా వాట్సాప్‌ గ్రూపులకు కూడా ఫీజు పెట్టాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయ్యా.. ఎలాన్‌ మస్క్‌‌.. మీరు దయచేసి వాట్సాప్‌ను కొనండి.. 0 డీలర్లు ఫీజు పెట్టండి అంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

Twitter Users Jokes on Whatsapp for Group Fees on Groups, Elon Musk Should Buy

అదేగాని చేస్తే.. మస్క్ ఇక డాలర్లే డాలర్లు అంటూ హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేయడం ట్రెండింగ్ మారింది. ఈ ట్వీట్లకు నెటిజన్ల రీట్వీట్లు కూడా కుప్పల కొద్ది వస్తున్నాయి. నెటిజన్లు కూడా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కో ట్విట్టర్ యూజర్.. బ్రో.. మీరు అలా సలహాలు ఇవ్వొద్దని ఒకరు అంటే..


మరోకరు. మస్క్ అదే పని చేస్తే.. ఫీడా పొద్ది.. ఫ్యామిలీ గ్రూపు, ఆఫీసు గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్ ఇలాంటి గ్రూపులతో నిండిపోయాయంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇప్పటికే ట్విట్టర్ కొనేసిన మస్క్.. ఆ కంపెనీలోని 55 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించాడు. అదే వాట్సాప్ కొనుగోలు చేస్తే.. వాట్సాప్ యూనివర్శిటీ విద్యార్థులందరినీ కూడా సస్పెండ్ చేస్తారునుకుట అని మరోకరు కామెంట్ చేశారు. మస్క్ ఈ పనిచేసి పుణ్యం కట్టుకోవయ్యా.. కొద్దిగైనా స్పామ్ మెసేజ్ సమస్య తగ్గిపోతుందని ట్వీట్ చేశారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Status Hide : వాట్సాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ ఇలా సీక్రెట్‌గా హైడ్ చేసుకోవచ్చు.. ఇలా ఎనేబుల్ చేయొచ్చు!