UK Woman ‘stepping stone’ Roman artifact : మనం పారేసే రాయి రత్నమై ఉండొచ్చు. ఎందుకు పనికిరాదనుకున్న రాయి ఎప్పటికైనా విలువైనదికావచ్చు. ఆ రాయి కళాఖండమవ్వొచ్చు. అదే జరిగింది యూకేలో. బ్రిటన్ దేశంలోని వైట్‌పారిష్ గ్రామానికి చెందిన ఓ యువతికి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఇష్టం ఉన్నాగానీ పాపం ఆయువతికి గుర్రం ఎక్కలేదు. కారణం ఆమె ఎత్తు. అంత ఎత్తున్న గుర్రం ఎక్కలేకపోయింది. దీంతో ఆమె తన ఇంటిలో గుర్రం ఎక్కటానికి..తన ఇంటి పెరట్లో ఎప్పుటి నుంచి పడి ఉన్న ఓ మార్బుల్ రాయిని ఏర్పాటు చేసుకుంది.
ఆ మార్బుల్ స్లాబ్ ముక్క తెచ్చుకొని కాళ్ల కింద వేసుకుంది. ఈసారి గుర్రం ఎక్కడానికి ఆ రాయి ఆమెకు సరిగ్గా సరిపోయింది. దీంతో ఆ రాయిని అలానే వాడటం మొదలు పెట్టింది.అలా ఆమె గుర్రపు స్వారీ బాగా నేర్చుకుంది. ఇది జరిగి 20 ఏళ్లు దాటిపోయింది. అలా ఆమె ప్రతీరోజు గుర్రపు స్వారీ చేస్తుండేది. ఈ రాయి ఎక్కి గుర్రం ఎక్కేది.
ఈక్రమంలో ఆ యువతి..తను ఇంతకాలం కాళ్ల కింద వేసుకొంటున్న రాయిపై ఏదో బొమ్మ ఉండటం గమనించింది. ఆ బొమ్మవంక పరీక్షగా చూడటంతో అది పురాతన కాలంనాటి గుర్తులాగా ఉందే అని అనుకుంది. దీంతో ఆమెకు అనుమానం వచ్చి..ఆ రాయిని తీసుకొని ఆర్కియాలజీ డిపార్టుమెంటుకు వెళ్లి..అధికారులకు ఆ మార్బుల్ స్లాబ్ రాయిని చూపించింది.
దాన్ని పరీక్షించిన ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోయారు. అది 200వ సంవత్సరం కాలానికి చెందిన రాయని గుర్తించారు. గ్రీసుదేశం లేదా ఆసియాలో ఎక్కడి నుంచైనా ఆ రాయి వచ్చుండొచ్చని తెలిపారు. సదరు రాయి ఇంగ్లండ్‌కు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని..అయితే ఇలా ఓ ఇంటి పెరట్లోకి ఎలా వచ్చిందో మాత్రం తెలియడం లేదని పరిశోధకులు ఆశ్యర్యం వ్యక్తంచేశారు.
ఏది ఏమైనా ప్రస్తుతం ఈ మార్బుల్ స్లాబ్ ముక్క ధర 20వేల డాలర్లపైగానే ఉండొచ్చని అంటున్నారు. దీన్ని వేలం వేయడానికి నిర్ణయించగా.. 15లక్షల రూపాయల వరకూ ధర పలకొచ్చని చెప్తున్నారు. ఇంతకాలం తను కాళ్ల కింద ఎత్తు కోసం వాడుకున్న రాయి ఇంత ధర పలుకుతుందని తెలిసిన సదరు యువతికి నోట మాట రావడం లేదు. అధికారుల నుంచి వచ్చిన ఆ మాటకు షాక్ నుంచి కోలుకోవటానికి ఆమెకు చాలా సమయం పట్టింది.
కాగా..ఆమె ఉంటున్న ఇల్లు వైట్‌పరీష్‌లోని రాక్ గార్డెన్ 1960 ల మధ్యలో నిర్మించిన ఇంటిలో భాగం అయి ఉండవచ్చని అంటున్నారు.
“కోవెస్ఫీల్డ్ హౌస్ మరియు బ్రోక్స్మోర్ హౌస్” అని పిలువబడే ఆంగ్ల దేశీయ గృహాలు వైట్పారిష్కు చాలా దగ్గరగా ఉన్నాయి. అంతేకాదు యుద్ధ సమయంలో (బ్రిటిష్) సైన్యం కోరిన తరువాత 1949 లో పడగొట్టబడ్డాయి. కానీ ఇప్పుడు [ఫ్యామిలీ థీమ్ పార్క్] వద్ద ఉన్న ఈ ఇల్లు 1963 లో అగ్నిప్రమాదంలో ధ్వంసమైందని మాకు తెలుసు..అందువల్ల అక్కడ నుండి శిధిలాలు ఆ ప్రాంతంలోని భవనాల స్థలాల వద్ద తిరిగి ఉపయోగించబడి ఉంటాయని ఓ అధికారి తెలిపారు.