Undertrail gangster brings bottle filled with dead mosquitoes to court in Maharashtra
gangster brings bottle filled with dead mosquitoes In Mumbai Court : జైల్లో దోమలు తెగ కుట్టేస్తున్నాయ్..నిద్రే పట్టటంలేదు..దోమ తెర ఏర్పాటు చేమంటూ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నాడు ఓ గ్యాంగ్ స్టర్. జైల్లో దోమలు ఎంత తీవ్రంగా ఉన్నాయో కోర్టుకు తెలియజేయటానికి ఏకంగా ఓ బాటిల్ నిండా చచ్చిపోయిన దోమల్ని పట్టుకుని మరీ కోర్టుకు వచ్చాడు ముంబయిలోని తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఎజాజ్ అనే గ్యాంగ్ స్టర్..
తన కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సందర్భంగా తాను తీసుకొచ్చిన దోమల బాటిల్ న్యాయమూర్తికి చూపిస్తూ..జైల్లో దోమలు బాగా కుడుతున్నాయి సార్..నిద్ర పట్టటంలేదు..దయచేసి దోమల తెర ఏర్పాటు చేయండీ సార్అంటూ కోరాడు. విచారణ సందర్భంగా ఆ బాటిల్‌ను న్యాయమూర్తికి చూపించి.. దోమల బారి నుంచి రక్షించుకునేందుకు తనకు దోమ తెరను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అంటూ విన్నవించుకున్నాడు.
పలు కేసుల్లో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతగాడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాజీ అనుచరుడు కూడా. లక్డావాలా, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడు. తలోజా జైల్లో దోమల సమస్య తీవ్రంగా ఉందని.. తన సెల్ లో దోమ తెర ఏర్పాటు చేయాల్సిందిగా సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ పిటిషన్‌కు సంబంధించి గురువారం (నవంబర్ 3,2022) విచారణ జరుగగా గ్యాంగ్ స్టర్ ఎజాజ్ హాజరయ్యాడు. జైలు గదిలో తాను చంపిన దోమలను ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో నింపి దాన్ని కోర్టుకు తీసుకువచ్చాడు. విచారణ సందర్భంగా ఆ బాటిల్‌ను చూపిస్తూ.. జైల్లో పరిస్థితి ఇలా ఉంది…కనీసం కంటినిండా నిద్రపోవటానికి కూడా లేదు. దోమ తెర ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరాడు. పైగా తాను 2020లో తాను అరెస్టయినప్పుడు ఓ దోమ తెర ఏర్పాటు చేశారని..కానీ కొన్ని రోజులకు దాన్ని తొలగించారని..ఇప్పుడు దాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరాడు.
సదరు విన్నపాన్ని విన్న న్యాయమూర్తి దోమతెర పిటిషన్ కొట్టివేశారు. దోమల బారి నుంచి కాపాడుకునేందుకు దోమ తెరలే వినియోగించాల్సిన అవసరం లేదని..ప్రత్యామ్నాయంగా ఇతర సాధనాలను వినియోగించాలని స్పష్టం చేశారు.కాగా గత సెప్టెంబర్ (2022)లో..కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖా కూడా దోమల నెట్ కావాలని అనుమతి కోరుతూ ఒక దరఖాస్తును దాఖలు చేశారు..అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.