Uniform Civil Code Draft : ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి యూనిఫాం సివిల్ కోడ్ డ్రాఫ్ట్

నిపుణుల కమిటీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా నివేదికను జులై 15వతేదీలోగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. ముసాయిదా నివేదికకు నిపుణుల కమిటీ తుది మెరుగులు దిద్దే పనిలో ఉందని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు...

Uniform Civil Code Draft

Uniform Civil Code Draft : నిపుణుల కమిటీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా నివేదికను జులై 15వతేదీలోగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. ముసాయిదా నివేదికకు నిపుణుల కమిటీ తుది మెరుగులు దిద్దే పనిలో ఉందని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ యూనిఫాం సివిల్ కోడ్ డ్రాఫ్ట్ సమర్పించాక దీనిపై ప్రత్యేకంగా విధానసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్ణయించారు. (Uttarakhand Expected To Be Submitted By July 15)

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్ నదిలో పడిన కారు..ముగ్గురి గల్లంతు

ఈ నివేదికకు సంబంధించి కమిటీ మరో ముఖ్య సమావేశాన్ని ఈ నెల 9వతేదీన ఢిల్లీలో నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ డ్రాఫ్టులో చట్టపరమైన పలు నిబంధనలు, సిఫార్సులను పొందుపర్చారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ప్రత్యేకంగా విధానసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. యూనిఫాం సివిల్ కోడ్ ఈశాన్య ప్రాంత గిరిజనులను ప్రభావితం చేయదని ఓ మంత్రి చెప్పారు.

Bengal Panchayat Polls : కేంద్ర భద్రతా బలగాల పహరా మధ్య పంచాయతీ పోలింగ్ ప్రారంభం

యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై గత సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2 లక్షలమందితో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల అభిప్రాయాలను తీసుకొని నిపుణుల కమిటీ ముసాయిదా నివేదికను రూపకల్పన చేసిందని సీఎం పుష్కర్ సింగ్ చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం దేశానికే మోడల్ గా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.

President Joe Biden : యూఎస్ అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేసింది..జో బిడెన్ వెల్లడి

మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 చట్టం అందరికీ సమానంగా ఉండాలని పేర్కొందని, దీంతో యూసీసీని అమలు చేసే బాధ్యతను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. యూసీసీని ఉత్తరాఖండ్ ప్రలు ఆదరించడంతో దీన్ని అమలు చేసే అవకాశం, గౌరవం దక్కిందని సీఎం వివరించారు.

ట్రెండింగ్ వార్తలు