Union Budget 2022 : PM ఆవాస్ యోజన కింద.. 80 లక్షల ఇళ్లు : మంత్రి నిర్మలా

ఈ ఆర్థిక సంవవత్సరంలో అర్హులైనవారికి PM ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

Budget 2022 (3)

union Budget 2022 : 80 lakh houses PM Awas Yojana 2022-23: సొంతింటి కల సాకారం చేసుకోవాలనువారి కోసం మంత్రి నిర్మలమ్మ శుభవార్త తెలిపారు. ఈ బడ్జెట్ లో ఇళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఇళ్లు పూర్తి చేసి అందిస్తామని ప్రకటించారు.దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే బడ్జెట్ ను మంత్రి నిర్మలమ్మ పార్లెమెంట్ లో ప్రవేశ పెట్టిన సందర్భంగా పలు కీలక విషయాలను ప్రకటించారు. యువతకు రానున్న ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చిన మంత్రి పేదలకు కూడా శుభవార్త చెప్పారు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించేవారికి ఈ ఆర్థిక సంవత్సరంలో 80లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. తన బడ్జెట్ 2022 ప్రసంగంలో 2022-23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజన కింద అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు పూర్తి చేస్తామన్నారు.

2022 ప్రసంగంలో 2022-23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన లబ్ధిదారుల కోసం 80 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.48,000 కోట్లు కేటాయించామని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు భూమి, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతుల సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

“అందరికీ గృహాలు” అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి మా ప్రభుత్వం గ్రామీణ గృహనిర్మాణ పథకాన్ని రూపొందించిందని మంత్రి తెలిపారు. కాగా..ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామిన్ (PMAY-G) నవంబర్ 20, 2016న ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2016 నుంచి అమలులోకి వస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 25 జూన్ 2020 నాటికి ఐదేళ్లు పూర్తయింది.

ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి గాని ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ 2022 కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం (ఫిబ్రవరి 1,2022) పార్లమెంట్ లో సమర్పించిన సందర్భంగా పలు కీలక అంశాలను వెల్లడించారు. దేశ ఆర్థికాభివృద్ధి కోసం మా ప్రభుత్వం నిరంతరం కృష్టి చేస్తోందని..చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి, పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టంచేశారు.