Delhi Two rupes to call farmers? : గత 76 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులని, ఖలిస్తానీలని వాళ్లసలు రైతులే కాదనీ..బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు చేయటం..రైలుల్ని కాల్చేయాలని.. ఢిల్లీ పోలీసులు ఆ పనిచేయకపోతే..వాళ్లను చెప్పుతో కొడుతానని ఓ ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై ఆఫ్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సంజయ్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ..రైతుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.
రైతులతో ప్రభుత్వం 11 సార్లు చర్చలు జరిపింది. కానీ ఏం లాభం? ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 11సార్లు చర్చలు జరిపారు కానీ..రైతులకు ఫోన్ కాల్ చేసి మాట్లాడటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 రూపాయలు లేవా? అని ప్రశ్నించారు. మీ దగ్గర రెండు రూపాయలు లేకుంటే.. మేమిస్తాం తీసుకోండి..వెంటనే రైతులకు ఫోన్ చేయండి..మాట్లాడండీ అంటూ ఎంపీ సంజయ్ సింగ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగు చట్టాలపై ఇటీవల ప్రధాని మాట్లాడుతూ..ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో ఉందని అన్న విషయం తెలిసిందే. ఆ మాటను గుర్తు చేస్తూ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతు ఆందోళనల్లో 165 మంది రైతులు మృతి చెందారనీ ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. రైతులకు నష్టం కలిగించే సాగు చట్టాలని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం హద్దు మీరి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రోడ్డుపై 12 ఇంచుల ఇనుప చువ్వలను ఎందుకు పెడుతున్నారని..రైతులేమన్నా ఉగ్రవాదులా? మీమీద దాడి చేయటానికి వస్తున్నారా? అని తీవ్రంగా ప్రశ్నించారు.
రైతులు, జర్నలిస్టులపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు అవ్వటం ఎంత వరకూ సమంజసం? రైతులు వారి హక్కుల గురించి పోరాడే హక్కువారికి లేదా? రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులపై కేసు పెడుతారా అని ప్రశ్నించారు.
ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికీ రైతులకు మద్దతు ఇస్తుందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టంచేశారు. సాగు చట్టాలు కేవలం నాలుగురు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టటానికే ఉపయోగపడుతందని విమర్శించారు. తమ పార్టీ ఎప్పటికీ రైతులకు మద్దతు ఇస్తూనే ఉంటుందని స్పష్టంచేశారు. కశ్మీర్ లో హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు చేసే ఇంటర్నెట్ సేవలను నిలిపివేతల్ని రైతుల ఆందోళన సమయాల్లో చేయటానికి వాళ్లేమన్నా మన శతృ దేశాలావారా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఎర్రకోట ఘటనలో సూత్రధారిగా ఉన్న దీప్ సిద్ధూ.. ఓ బీజేపీ నేత అని ఆప్ ఎంపీ సంజయ్ సిగ్ ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు.