University forces professor to quit over complaint of student looking at her bikini pics
Prof bikini pics: ఒక విద్యార్థి తన బికినీ ఫొటోలను చూసిన కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న సెయింట్ జేవియర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసిన ఒక మహిళ ఆరోపించారు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ అయిన ఆ ఫొటోలను ఆమె వద్ద చదువుతున్న విద్యార్థి తదేకంగా చూడడాన్ని అతడి తండ్రి చూసి యూనివర్సిటీలో ఫిర్యాదు చేయగా, యూనివర్సిటీ ఆమెను నిర్దాక్షిణ్యంగా గెంటివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ యూనివర్సిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన ఏడాది క్రితం జరిగిందట. ఒక రోజు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లోదుస్తులు ధరించి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. అయితే అండర్ గ్రాడుయేషన్ చదువుతున్న ఒక విద్యార్థి (18) తదేకంగా ఆ ఫొటోలను చూడడం తన తండ్రి గమనించాడు. లో దుస్తులు ధరించి అశ్లీలంగా, అసహ్యంగా, అభ్యంతరకరంగా కనిపిపిస్తున్న ఫొటోలను తన కుమారుడు చూస్తుండగా తాను పట్టుకున్నానని, ఓ తండ్రిగా తన కుమారునికి చదువు చెప్పే ప్రొఫెసర్ ఈ విధంగా కనిపించడంతో సిగ్గుపడ్డానని పేర్కొన్నారు. లైంగికంగా రెచ్చగొట్టే విధంగా ఆ ఫొటోల్లో ఆమె కనిపించారని యూనివర్సిటీకి చేసిన ఫిర్యాదులో ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఫిర్యాదు గురించి యూనివర్సిటీ తనకు 2021 అక్టోబర్ 7న చెప్పారని, ఫిర్యాదులో తన ఇన్‌స్టా ఖాతాలోని కొన్ని ఫొటోలను సైతం జత చేశారని చెప్పిన యూనివర్సిటీ యాజమాన్యం, అవి ఏ ఫొటోలో తనకు చూపించలేదని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. వాస్తవానికి తన ఇన్స్టాగ్రామ్ ఎవరో హ్యాక్ చేశారని, వారే ఈ ఫొటోలను షేర్ చేసి ఉంటారని ఆమె అన్నారు. దీనిని పట్టించుకోకుండా యూనివర్సిటీ తనపై చర్యలు తీసుకుందని, యూనివర్సిటీ తీసుకున్న ఈ చర్య లైంగిక వేధింపుల కిందకు వస్తుందని, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేయడమవుతుందని ఆమె అన్నారు.
Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్నర్ గొంతు కోసిన మహిళ