UP Minister Rakesh Sachan 1 year jailed : ఆయుధాల చట్టం కేసులో యూపీ మంత్రికి ఏడాది జైలు శిక్ష

యూపీ మంత్రి రాకేష్ సచన్‌కు కాన్పూర్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో కాన్పూరు కోర్టు మంత్రికి ఏడాది జైలు శిక్ష‌తో పాటు రూ 1500 జ‌రిమానా విధించింది.

UP minister Rakesh Sachan 1 year jailed : యూపీ చిన్న, మధ్య తరహా సంస్థలు, ఖాదీ శాఖల మంత్రి రాకేష్ సచన్‌కు కాన్పూర్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారు విషయాన్ని ముందే ఊహించారో ఏమోగానీ తీర్పు వెలువరించకముందే మంత్రిగా అక్కడ నుంచి జారుకున్నారు. 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో కాన్పూరు కోర్టు మంత్రికి ఏడాది జైలు శిక్ష‌తో పాటు రూ 1500 జ‌రిమానా విధించింది.

కాగా..రాకేష్ స‌చ‌న్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ కేసులో మంత్రిని దోషిగా తేల్చి శిక్ష ఖ‌రారు చేయ‌కుముందే ఆయ‌న కోర్టు నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మీడియా ప్రశ్నించగా..మంత్రిగారు మండిపడుతూ..తాను కోర్టు నుంచి వెళ్లిపోలేద‌ని..ఇవి కేవలం పుకార్లేనంటూ కొట్టిపారేశారు.కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని..జ‌రుగుతున్న ప‌రిణామాలు ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా ఉన్నాయ‌ని రాకేష్ స‌చ‌న్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా..ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాకేష్ సచన్‌ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అక్రమ ఆయుధాలకేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ.. గత శనివారం (ఆగస్టు 6,2022) కాన్పూర్ కోర్టు తీర్పుచెప్పింది. శిక్షను మాత్రం వాయిదా వేసింది.1990 దశకంలో రాజకీయాల్లోకి వచ్చిన సచన్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 1993, 2002లో ఘటంపూర్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నికల్లో ఫతేపూర్ లోక్‌సభ సీటు గెలిచారు. ఈక్రమంలో మరోసారి పార్టీ మారి గత యూపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి గెలిచి మంత్రికూడా అయ్యారు. కానీ గతంలో చేసిన తప్పులు వదలక జైలుశిక్ష రూపంలో వెంటాడాయి.

 

ట్రెండింగ్ వార్తలు