అమ్మంటే అంతేమరి : కొడుకు కోసం ‘ఇండియన్ ఐడల్’ షో వదిలేసుకున్న గాయని

UP Mother who gave up Indian Idol Chance for son operation : ‘అమ్మ’అంటే అంతే మరి. పిల్లల కోసం తన సుఖాలను..సంతోషాలకే కాదు తన భవిష్యత్తును కూడా త్యాగం చేసే త్యాగమూర్తి. బిడ్డల కోసం తమ కెరీర్ ను వదిలేసుకునే తల్లులు ఓ సాధారణ మహిళల్లా మిగిలిపోతున్నారు. వారిలో ఉండే టాలెంట్ లను వదిలేసుకుని పిల్లల కోసం వదిలేసుకుంటున్నారు. అటువంటి ఓ అమ్మ తన కొడుకు గొంతు ఆపరేషన్ కోసం తన శ్రావ్యమైన గొంతును అదిమిపెట్టేసుకుంది. అ తల్లి పాటకుఎంతోమంది అభిమానులున్నా..తన రెండేళ్ల కొడుక కోసం తన పాటను గొంతులోంచి బైటకు రాకుండా చేసుకుంది. కొడుకుకు గొంతు ఆపరేషన్ కోసం ఆ తల్లి‘ ఇండియన్ ఐడల్’’ లో దక్కిన పాటలు పాడే అవకాశాన్ని మధ్యలోనే వదిలివేల్సి వచ్చింది.

యుపిలోని ముజఫర్ నగర్కు చెందిన ఫర్మాని నాజ్ కు చిన్ననాటినుంచే సంగీతం అంటే ప్రాణం పెట్టే ఆమె తన కలను పాటల రూపంగా ఆలపించి సాకారం చేసుకోవాలను కుంది. స్కూల్లో చదివేటప్పుడు చక్కటి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంది. కానీ పెద్దయ్యాక గాయని కావాలనే ఆమె కల నెరవేరలేదు.కానీ సోషల్ మీడియా పుణ్యమాని తన గాన ప్రతిభను చాటుకుంది. తను పాడిన పాటల్ని రికార్డు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసేది. ఆమె పాటలకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా దక్కింది.

ఫలితంగా ఆమె సోషల్ మీడియా సింగర్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఆమె టాలెంట్ కు ఓ వేదిక దొరికింది. ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం దక్కింది. దీంతో ఆమె ఎంతో సంతోషపడిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా..అనుకోకుండా ఆమె రెండేళ్ల కొడుకు ఆర్ష్ కి గొంతు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

దీంతో ఆమె ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలివేసి..కొడుకు గొంతు ఆపరేషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆమె గొంతు దూరమైనందుకు నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు ఆమె చిన్నారి కొడుకు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. తిరిగి ఫర్మాని గొంతు వినాలనుకుంటున్నామని ఆ అవకాశం మాకు మరోసారి దక్కుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

యూపీలోని ముజఫర్ నగర్ కు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తికి ఐదుగురు పిల్లలలు. ఆ ఐదుగురు పిల్లల్లో ఫర్మానీ నాజ్ స్వరం అంటే ఆ గ్రామంలో అందరూ ఇష్టపడేవారు. స్కూల్లో చక్కటి పాటలతో అందరిని ఆకట్టుకుంది చిన్నారి ఫర్మానీ. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక ఫర్మానిని హసన్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ ఇమ్రాన్‌ కు ఇచ్చి వివాహం చేశారు.

రెండేళ్ల క్రితం వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి పుట్టినప్పటి నుంచే గొంతు సమస్య ఉంది. గొంతులో రంధ్రంతో పుట్టాడు. దీంతో డిగ్రీ మాట్లాడలేకపోయేవాడు. దీంతో మాటలు రాని పిల్లాడ్ని కన్నావ్ అంటూ అత్తమామలు వేధించేవారు. భర్త కూడా సూటీ పోటీ మాటలు మాట్లాడేవాడు. వారి వేధింపులు భరించలేని ఫర్మాని పిల్లాడ్ని తీసుకుని పుట్టింటికి వచ్చేయాల్సి వచ్చింది.

అలా తన బాధల్ని తన పాటల రూపంలో పాడుకునేది ఫర్మానీ. ఈ క్రమంలో అషు బచ్చన్, రాహుల్ అనే ఇద్దరు యూట్యూబర్లు వారి గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో తన బాధల్ని పాటగా పాడుకునే ఫర్మాని గొంతు వారు విన్నారు. అబ్బా ఎంత బాగుందీ స్వరం..ఈ గ్రామంలో ఇంత బాగా పాడేవారు ఎవరు? అంటూ..ఫర్మాని గురించి తెలుసుకున్నారు.

అలా ఫర్మాని పాట పాడమని ఆ పాటను రికార్డు చేసి ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఫర్మాని పాడిన ఆ పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేసింది. ఎంత బాగుందీ గొంతు అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. దీంతో ఫర్మానీ నాజ్ యూ ట్యూబ్ స్టార్ అయిపోయింది. ఆమె గొంత సోషల్ మీడియాలో తెగ పాపురల్ అయిపోయింది. ఆ పాపురల్ ‘ఇండియన్ ఐడల్’ నిర్వాహకుల వరకూ వెళ్లింది. దీంతో నిర్మాహకులు ఫర్మానికి ‘ఇండియన్ ఐడల్’ లో పాటలు పాడే అవకాశాన్ని కల్పించారు.ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా మంచి గొంతు ఉందని తెలుసుకని ఇద్దరికీ ‘ఇండియన్ ఐడల్’ వేదికపై పాటలు పాడే అవకాశాన్ని కల్పించారు. అలా ఇద్దరూ నెక్ట్స్ రౌండ్ కు ఎంపిక అయ్యారు.

సరిగ్గా అదే సమయంలో ఫర్మానీ రెండేళ్ల కొడుకు ఆర్ష్ కు ఆపరేషన్ చేస్తే మాటలు వస్తాయని తెలుసుకుని మీరట్ లోని ఓ హాస్పిటల్ లో చూపించాగా..ఆపరేషన్ కు రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. కొడుకుకు ఆపరేషన్ చేస్తే మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పిన మాటకు ఫర్మాని ఎంతో సంతోషపడిపోయింది.

దీంతో ఆమె ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలివేసి..కొడుకు కోసం తన కెరీర్ ను వదులుకుంది. కొడుకు గొంతు ఆపరేషన్ కోసం మీరట్ హాస్పిటల్ కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఒకవైపు నిరాశ వ్యక్తం చేస్తూనే, మరోవైపు ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

దీని గురించి ఫర్మానీ మాట్లాడుతూ..నా కొడుకు భవిష్యత్తు కంటే తనకు ఏమీ ఎక్కువ కాదని..అందుకే తనకు అదృష్టంగా దొరికిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఇండియల్ ఐడల్’లో పాటలు పాడే అవకాశాన్ని కూడా వదులుకుంటున్నానని తెలిపింది. ఈ ఆపరేషన్ వల్ల తన కొడుకుకు మాటలు వచ్చి భవిష్యత్తులో తన కొడుకు పాటలు పాడితే వినాలని ఉందని సంతోషంగా చెప్పింది. ఇప్పటి వరకూ తాను గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఎంతగానో కోరుకున్నాననీ..ఇకనుంచి తన కొడుకుని గాయకుడిగా చూడాలని కోరికతో జీవిస్తానని చెప్పింది. గాయకుడిగా నా కొడుకుని తీర్చి దిద్దుతానని నా కలను నా కొడుకు రూపంలో చూసుకుంటానని తెలిపింది.

కొడుకు ఆర్ష్ కు ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తయింది. త్వరలో నీ కొడుకు మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ప్రపంచాన్ని జయించినంతగా సంబరపడిపోతోంది ఆ తల్లి. ఎంతైనా అమ్మ కదా..కొడుకు భవిష్యత్తు కంటే తన కెరీర్ ముఖ్యం కాదనుకుంది..అంతేమరి అమ్మంటే..