US central bank: మళ్లీ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు

ముందునుంచి ఉన్న అంచనాల ప్రకారమే వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. 0.75 శాతం బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అక్కడి మార్కెట్లకు జోష్ తెచ్చింది.

US central bank: అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 0.75 శాతం వడ్డీ రేట్లు పెంచింది. 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మార్కెట్ వర్గాలకు కలిసొచ్చింది. ఈ నిర్ణయం వల్ల బుధవారం అమెరికన్ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. అమెరికాలో ధరల కట్టడికి బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయం ఉపయోగపడుతుందని ఫెడరల్ బ్యాంకు భావించింది.

Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. తయారీ కంపెనీలకు ఐసీఎమ్ఆర్ ఆహ్వానం

ద్రవ్యోల్బణం కంటే ధరల్ని అదుపు చేయడమే తమ మొదటి ప్రాధాన్యమని ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమీ పావెల్‌ ఇంతకుముందే స్పష్టం చేశారు. ఫెడరల్ బ్యాంక్ నిర్ణయంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25–2.50 శాతానికి చేరాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ఉద్దేశంతో జనవరి నుంచి జూన్ వరకు వడ్డీ రేటును 1.5 శాతం పెంచింది. ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే వడ్డీ రేట్లు ఈ ఏడాది చివరి వరకు 3.4 శాతానికి చేరొచ్చని అంచనా. ఫెడరల్ బ్యాంకు నిర్ణయంతో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలర్ ఇండెక్స్‌ 107ను దాటింది. రేట్ల పెంపు అంచనాలతో ఈ నెల మొదట్లో డాలర్ ఇండెక్స్‌ రెండు దశాబ్దాల గరిష్టం 109.29ను తాకిన సంగతి తెలిసిందే. అయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Arpita Mukherjee: అర్పిత మరో ఫ్లాట్ నుంచి 29 కోట్లు స్వాధీనం

మరోవైపు అమెరికా నిర్ణయం ఇతర దేశాల మార్కెట్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో దేశీ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఫెడరల్ బ్యాంక్ బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అందరిదృష్టీ ఆర్‌బీఐపై పడింది. ఆర్‌బీఐ కూడా రేట్లు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు