Arpita Mukherjee: అర్పిత మరో ఫ్లాట్ నుంచి 29 కోట్లు స్వాధీనం

బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.

Arpita Mukherjee: అర్పిత మరో ఫ్లాట్ నుంచి 29 కోట్లు స్వాధీనం

Arpita Mukherjee

Arpita Mukherjee: పశ్చిమ బెంగాల్ ఎస్ఎస్‌సీ స్కాంలో నోట్ల కట్టలు భారీగా బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇప్పటికే రూ.21 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ.29 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.

Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. తయారీ కంపెనీలకు ఐసీఎమ్ఆర్ ఆహ్వానం

ఈ డబ్బు కూడా అర్పితకు చెందిన రెండో ఫ్లాట్‌లోనే దొరకడం విశేషం. బుధవారం మధ్యాహ్నం నుంచి కోల్‌కతాలోని అర్పితకు చెందిన రెండో ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుఝాము వరకు ఈ సోదాలు సాగాయి. ఈ సోదాల్లో దాదాపు రూ.21కోట్ల నగదు, ఐదు కేజీల వరకు బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పది పెద్ద బాక్సుల్లో నగదును తరలించారు. నగదు లెక్కపెట్టేందుకు మూడు నోట్ కౌంటింగ్ మెషీన్లను అధికారులు వినియోగించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఈ సోదాల్లో లభ్యమయ్యాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడ్డ నగదు మొత్తం రూ.50 కోట్లకు చేరింది.

Google Street View: హైద‌రాబాద్ స‌హా 10 న‌గ‌రాల్లో గూగుల్ మ్యాప్‌లో ‘స్ట్రీట్ వ్యూ’ సేవ‌లు షురూ

కాగా, తన ఫ్లాట్లను మంత్రి పార్థా ఛటర్జీ వినియోగించుకునే వారని అర్పిత తెలిపింది. పార్థా ఛటర్జీ మంత్రిగా ఉన్న సమయంలో టీచర్ల రిక్రూట్‌మెంట్ విషయంలో అవినీతికి పాల్పడ్డట్లు సమాచారం రావడంతో ఈడీ దాడులు నిర్వహించింది. పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. టీఎమ్‌సీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను కూడా ఈడీ విచారించింది.