×
Ad

Valentines Day 2021 Special : ప్రేమికులకు వైన్ ఫ్రీ..

  • Published On : February 10, 2021 / 01:29 PM IST

Valentines Day 2021: లవర్స్ డే ఫిబ్రవరి 14. ఈ రోజు వస్తోందంటే చాలు ప్రేమికుల గుండెల్లో ప్రేమ పొంగిపోతుంది. ప్రేమలో ఉన్నవారికి అన్నీ రోజులు హ్యాపీగానే ఉంటాయి. కానీ Valentines Day వెరీ వెరీ స్పెషల్. అటువంటి రోజు Valentines Day మరో మూడంటే మూడు రోజుల్లో వచ్చేస్తోంది. దీంతో ప్రేమ జంటల్ని ఆకట్టుకోవడానికి వ్యాపారులు పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. లవర్స్‌ని ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్స్, బార్లు, క్లబ్బులు, లాంజ్‌లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంట్లో భాగంగా..కోల్‌కతాలో సౌల్ ది స్కై లాంజ్ వాలెంటైన్స్ డే కోసం స్పెషల్ మెనూ ప్రకటించింది. అంతేకాదు..ఓ ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రేమికులకు తెగ నచ్చేస్తోంది.


ఆల్రెడీ Valentines Week నడుస్తోంది. ఈ వారంలో ఒక్కోరోజు ఒక్కో స్పెషల్. ఆల్రెడీ ప్రేమికుల వారం నడుస్తోంది. మూడవరోజు చాక్లెట్ డేతో స్వీట్ స్వీట్ గా గడిపిన లవర్స్…నేడు అంటే నాలుగో రోజు టెడ్డీ బేర్ డే జరుపుకుంటున్నారు. ఇలా ప్రేమికుల వారంలో ఒక్కోరోజును ఒక్కో స్పెషల్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు లవర్స్. మరో మూడ్రోజుల తర్వాత ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు వస్తోంది. ఒకప్పుడు ఆ ఒక్క రోజే జరుపుకునే వేడుక జరుపుకునేవారు. కానీ ఇప్పుడు వారమంతా రకరకాల థీమ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో లవర్స్‌ని ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్స్, బార్లు, క్లబ్బులు, లాంజ్‌లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఈ ప్రేమికుల వీక్ ల రోజ్‌ డేతో మొదలైన వారంలో హగ్ డే, కిస్ డే, చాకొలెట్ డే, టెడ్డీ డే… ఇలా రోజుకో డే నడుస్తోంది. చివర్లో వచ్చే ప్రేమికుల రోజుకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆ రోజు మెనూ ఎలా ఉండాలనేదానిపై లవర్స్ ముందునుంచే ప్లాన్ వేసుకుంటారు.

జాలీగా లాంగ్ డ్రైవ్ చేస్తూ… అదిరిపోయే లంచో, డిన్నరో ప్లాన్ చేసుకుంటారు. రకరకాల మజా మజా మస్తీ చేయటానికి రెడీ అయిపోతున్నారు. దీంట్లో భాగంగా కోల్‌కతాలో సౌల్ ది స్కై లాంజ్ వాలెంటైన్స్ డే కోసం స్పెషల్ మెనూ ప్రకటించింది. ఇప్పటికే ఈ లాంజ్ రోజ్ డే నాడు కస్టమర్లకు గులాబీలను ఇచ్చింది. చాకొలెట్ డే నాడు చాకొలెట్స్ ఇచ్చింది. మరి వాలెంటైన్స్ డే నాడు ఎలా ప్రేమ కురిపించబోతోంది?అంటే..

వాలెంటైన్స్ డే నాడు స్పెషల్ కపుల్‌కి ఫొటో ఫ్రేమ్ చేయబోతున్నామని ప్రకటించింది. అంతేకాదు… ప్రతి ప్రేమ జంటకూ… ఓ బాటిల్ వైన్ ఫ్రీగా ఇవ్వబోతున్నామని చెప్పటంతో లవర్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు వాలెంటైన్స్ డే స్పెషల్ మెనూలో భాగంగా ఘుమఘుమలాడే చికెన్ తందూరీ, బార్బిక్యూ చికెన్ ఓవింగ్స్, ఫిష్ తందూరి, చీజ్ లాబబ్దార్, మలాయ్ బ్రకోలీ ఇలా చాలా వెరైటీ వెరైటీలు రెడీ చేసి ఘుమఘుమలాడించేస్తోంది.

స్పెషల్ రెడ్ వెల్వెట్ చీజ్ కేక్స్, హార్ట్ బ్రౌనీస్ కూడా రెడీ అవుతున్నాయి. ఇక లైవ్ మ్యూజిక్, డీజేలు ఉండనే ఉన్నాయి. ప్రేమికుల వారం సందర్భంగా ఈ స్పెషాలిటీలు ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 15 వరకూ ఉంటాయని చెబుతోంది. ఈ లాంజ్‌లో కపుల్‌కి రూ.1500 ఛార్జి చేస్తున్నారు. కాగా..ఈ ఏడాది ఇటువంటి ఆకట్టుకునే ఆఫర్లు దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నాయి.