Vande Bharats New Colour : వందేభారత్ రైళ్లకు ఇక కాషాయరంగు

బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్తగా కాషాయ రంగు వేశారు. ఈ రైళ్లు నిర్మించిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముదురు నీలంరంగులో ఉన్న వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపువ్వు రంగు వేస్తున్నారు....

Vande Bharat New Colour

Vande Bharat New Colour : బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్తగా కాషాయ రంగు వేశారు. ఈ రైళ్లు నిర్మించిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముదురు నీలంరంగులో ఉన్న వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపువ్వు రంగు వేస్తున్నారు. వందేభారత్ రైళ్ల కోసం ఇప్పటికే 27 ఇంజిన్లను తయారు చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister of Railways Ashwini Vaishnaw)

వందేభారత్ రైళ్ల  మెరుగుదలకు చర్యలు

శనివారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. దక్షిణ రైల్వేలో భద్రతా చర్యలను సమీక్షించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మెరుగుదలలను కూడా మంత్రి సమీక్షించారు. భారత త్రివర్ణ పతాకం స్ఫూర్తితో (New Colour Inspired By National Flag) వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపువ్వు రంగు వేశామని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు రైలు ఏసీల నుంచి టాయిలెట్ల వరకు మార్పులు చేశామని మంత్రి పేర్కొన్నారు.

సరికొత్త భద్రతా ఫీచర్ …యాంటీ క్లైంబర్స్ పరికరాలు

ఈ రైళ్లలో కొత్తగా యాంటీ క్లైంబర్స్ పరికరాలతో కొత్త భద్రతా ఫీచర్ ను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్టేషన్‌లో గోరఖ్‌పూర్-లక్నో, జోధ్‌పూర్-సబర్మతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ-వరణాసి మొదటి వందేభారత్ రైలు

దేశంలోనే మొట్టమొదటిసారి న్యూఢిల్లీ-వరణాసి వందేభారత్ రైలును 2019వ సంవత్సరం ఫిబ్రవరి 15వతేదీన ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా విస్తరించారు. స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైలు సెట్‌లను తయారు చేసే ప్రాజెక్ట్ 2017వ సంవత్సరం మధ్యలో ప్రారంభమైంది. 18 నెలల్లోనే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో చెన్నైలోని రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైలు నిర్మించారు. కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్‌లో ఈ రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.