Vemulawada Rajanna Temple Closed : చంద్రగ్రహణం కారణంగా నేడు వేములవాడ రాజన్న ఆలయం మూసివేత
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది.
- bheemraj
- Published On : November 8, 2022 / 07:50 AM IST
Vemulawada Rajanna temple closed
Vemulawada Rajanna temple is closed : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉదయం స్వామివారి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. అలాగే అనుబంధ ఆలయాల్లోనూ పూజల అనంతరం ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
