Vi Max Postpaid Plans : వోడాఫోన్ ఐడియా మ్యాక్స్ పోస్టు‌పెయిడ్ ప్లాన్లు ఇవే.. ఓటీటీ బెనిఫిట్స్ కూడా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Vi Max Postpaid Plans : ప్రముఖ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone idea) Vi భారత మార్కెట్లో Vi Max ప్లాన్‌లు అనే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు డేటా, SMS కోటా, మెరుగైన బిల్లింగ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ఆఫర్ల వంటి మరిన్ని బెనిఫిట్స్ కోరుకునే యూజర్ల కోసం అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

Vi Max postpaid plans with more internet data, Prime and Hotstar benefits launched in India

Vi Max Postpaid Plans : ప్రముఖ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone idea) Vi భారత మార్కెట్లో Vi Max ప్లాన్‌లు అనే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు డేటా, SMS కోటా, మెరుగైన బిల్లింగ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ఆఫర్ల వంటి మరిన్ని బెనిఫిట్స్ కోరుకునే యూజర్ల కోసం అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. Vi Max ప్లాన్‌లు రూ. 401 నుంచి ప్రారంభమై రూ. 1101 వరకు నాలుగు రేంజ్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. బేస్ టైర్ స్వల్ప బెనిఫిట్స్ అందిస్తుంది. అగ్రశ్రేణిలో అనేక బెనిఫిట్స్ అందిస్తున్నాయి. మాక్స్ ప్లాన్‌లు నవంబర్ 1 నుంచి భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్లు Vi చెప్పారు. అన్ని కొత్త మ్యాక్స్ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 3,000 మెసేజ్ SMS కోటా ఉన్నాయి. వోడాఫోన్ యూజర్లు నెలవారీ ఖర్చులపై చాలా ఎక్కువ కంట్రోల్ చేసేందుకు Vi యాప్ ద్వారా క్రెడిట్ లిమిట్ కూడా సెట్ చేయవచ్చు.

Vi Max postpaid plans with more internet data, Prime and Hotstar benefits launched in India

బేస్ మ్యాక్స్ 401పై రూ. 401 మైనస్ ట్యాక్సుల సుంకం ఉంటుంది. ఇందులో 50GB డేటాతో పాటు 200GB రోల్-ఓవర్ డేటా ఉన్నాయి. రాత్రి సమయంలో యూజర్లు అన్ లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అదనపు ప్లాన్ బెనిఫిట్స్ సహా 12 నెలల పాటు ఉచిత Sony Liv మొబైల్ సబ్‌స్క్రిప్షన్, Vi మూవీలు, టీవీకి యాక్సెస్, ఉచిత 1000 Vi గేమ్‌లు, Vi యాప్‌లో హంగామా మ్యూజిక్‌కి యాక్సెస్ అందిస్తుంది. మాక్స్ 501 ప్లాన్ తర్వాతి స్థానంలో ఉంది. పన్నులు మినహాయించి నెలకు రూ. 501 సుంకాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు 90GB నెలవారీ డేటాను, Amazon Primeకి 6-నెలల సభ్యత్వాన్ని పొందవచ్చు.

Disney+ Hostarకి 12-నెలల సభ్యత్వాన్ని పొందవచ్చు. వినియోగదారులు ఐదు Vi గోల్డ్ గేమ్‌లకు కూడా యాక్సెస్ పొందవచ్చు. Vi Max 701 ప్లాన్‌పై ట్యాక్స్ లేకుండా నెలవారీ రూ. 701 టారిఫ్‌ను కలిగి ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా, 12-నెలల సూపర్ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 6-నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అత్యంత ప్రీమియం Vi Max RedX 1101 ప్లాన్ (రూ.1101 టారిఫ్) Vi Max 701 వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. వినియోగదారులు మేక్ మై ట్రిప్ బెనిఫిట్స్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ (ఏడాదికి నాలుగు సార్లు), రూ. 2,999 విలువైన IR రోమింగ్ ప్యాక్‌ను కూడా పొందవచ్చు. అదనంగా, యూజర్లు ఒకసారి ఉచితంగా 12-నెలల Sony Liv ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio vs Airtel vs Vi Plans : నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు 30 రోజులు కాకుండా 28 రోజులే ఎందుకు ఉంటాయంటే?