Vice President: విశాఖకు ఉపరాష్ట్రపతి.. నాలుగు రోజులు బస ఇక్కడే!

రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు (జూన్ 26) విశాఖకు చేరుకున్నారు. కాగా నాలుగు రోజులపాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముండగా..

Vice President

Vice President: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు (జూన్ 26) విశాఖకు చేరుకున్నారు. కాగా నాలుగు రోజులపాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోర్టు అతిధిగృహంలో బస చేయనున్న ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముండగా.. 27 ఆదివారం నాడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవ వేడుకల్లో వర్చువల్​ విధానంలో విశాఖ నుంచే పాల్గొంటారు.

శనివారం ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో వెంకయ్య విశాఖకు చేరుకోకోగా విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు మేయరు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్న ఉపరాష్ట్రపతి 29న ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.