Vijay Devarakonda : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయడానికి ఎదురు చూస్తున్నా.. చెన్నైలో లైగర్..

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ''లైగర్‌ సినిమాలో నా పాత్రకి నత్తి ఉంటుంది. అలా నటించడానికి చాలా కష్టపడ్డాను. నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గతంలో తమిళంలో నోటా సినిమా చేశాను, తమిళ ప్రేక్షకులు.......

vijay devarakonda

 

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం లైగర్ ప్రమోషన్స్ చెన్నైలో నిర్వహించారు.

ఈ ప్రమోషన్స్ లో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ”లైగర్‌ సినిమాలో నా పాత్రకి నత్తి ఉంటుంది. అలా నటించడానికి చాలా కష్టపడ్డాను. నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గతంలో తమిళంలో నోటా సినిమా చేశాను, తమిళ ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారు. త్వరలో తమిళంలో వరుసగా నటిస్తాను. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్, వెట్రిమారన్, పా.రంజిత్‌ అంటే చాలా ఇష్టం, వారితో రెగ్యులర్ గా ఫోన్‌లో టచ్‌లో ఉన్నాను. త్వరలోనే లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాను” అని తెలిపారు.

Karthikeya 2 Success Celebrations : కార్తికేయ 2 సక్సెస్ సెలబ్రేషన్స్

సినిమా వాళ్ళు ఏ భాషలో ప్రమోషన్స్ చేయడానికి వెళ్తే అక్కడి వాళ్ళని పొగుడుతారన్న సంగతి తెలిసిందే. విజయ్ కూడా తమిళ్ లో మార్కెట్ కోసం ఇలా మాట్లాడారని తెలుస్తుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు అక్కడ. అందుకే అతని పేరుని వాడినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.