ప్రత్యర్థికి పంచ్ విసురుతున్న ‘లైగర్’..
- sekhar
- Published On : January 18, 2021 / 01:33 PM IST
LIGER: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి గతకొద్ది రోజులుగా ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ‘లైగర్’ అనే డిఫరెంట్ పేరు ఫిక్స్ చేశారు. ‘సాలా క్రాస్ బీడ్’ అనేది ట్యాగ్ లైన్..
పూరి సినిమా టైటిల్స్, హీరో క్యారక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. అదే స్థాయిలో టైటిల్, ట్యాగ్ లైన్, ఫస్ట్ లుక్ ఉన్నాయి.
‘లైగర్’ అంటే పులికి, సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ఓ వైపు పులి, మరో వైపు సింహం కనిపిస్తుండగా.. విజయ్ చేతులకు బాక్సింగ్ గ్లవ్స్‌తో ఒత్తైన జుత్తు, గెడ్డంతో సరికొత్త అవతార్‌లో ప్రత్యర్థికి పంచ్ విసురుతూ దర్శనమిచ్చాడు.
ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘లైగర్’ షూటింగ్ త్వరలో పున:ప్రారంభం కానుంది.
Humbly announcing our arrival Pan India!
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJu
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021
