Viral Video: ఓ వ్యక్తి తలపై మరో వ్యక్తి తలకిందులుగా నిలబడ్డాడు. అనంతరం వారిద్దరు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన తలపై ఓ వ్యక్తిని తలకిందులుగా నిలబెట్టుకున్న వ్యక్తి అలాగే మెట్లు ఎక్కాడు. ఏ మాత్రం భయపడకుండా, తన తలపై తలకిందులుగా ఉన్న వ్యక్తి కింద పడిపోకుండా అతడు మెట్లు ఎక్కిన తీరు అబ్బురపరుస్తోంది. అతడు మెట్లు ఎక్కే సమయంలో మరో వ్యక్తి మెట్టు దిగుతూ అడ్డువచ్చినప్పటికీ ఎటువంటి ఆటంకమూ కలగలేదు.
రెడిట్ లో ఓ వ్యక్తి ఈ వీడియో పోస్ట్ చేయగా దీనిపై నెటిజన్లు అమితాసక్తి కనబర్చుతున్నారు. ‘‘అలా ఎలా చేశావు భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి పడితే మీ ఇద్దరి పరిస్థితి ఏంటీ? అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ‘‘ఇటువంటి ఛాలెంజ్ ను ప్రారంభిస్తున్నారా? దీన్ని కనుక ప్రజలందరూ ట్రై చేస్తే అంతే సంగతి’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వీడియోను మీరూ చూడండి మరి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..