Viral Video
Viral Video: కుర్రాళ్లు బైక్ లపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్తుండడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. అలా చేయడం వల్ల తోటి వాహనదారులకూ ఇబ్బందులు కలుగుతాయి. అయితే, తాజాగా ఓ ప్రాంతంలో సైకిల్ పై ఓ వ్యక్తి విన్యాసాలు చేస్తూ వెళ్లాడు. అతడి వయసు దాదాపు 70 ఉంటుంది. అవును.. ఓ వృద్ధుడు సైకిల్‌పై విన్యాసాలు చేస్తూ వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ రోడ్డుపై పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుండగా వృద్ధుడు ఎడమ వైపు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో వర్షపు చినుకులు కూడా పడ్డాయి. సైకిల్ తొక్కుతూ ఆ వృద్ధుడు వెళ్తూ హ్యాండిల్ వదిలేసి చేతులను పైకి లేపాడు. కొద్దిసేపటి తర్వాత సైకిల్ పెడల్ పై నుంచి కాళ్లను తీసి పైన పెట్టాడు. రోడ్డుపై వేగంగా సైకిల్ తొక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మరో వాహనదారుడు తన స్మార్ట్ ఫోన్లో తీశాడు.
Viral Video: ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’తో పోల్చిన లెక్చరర్
జీవితంలోని ప్రతి క్షణం హాయిగా గడపాలంటూ ట్విట్టర్ లో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘ఈ వీడియో చూస్తే ఆ తాతయ్య ఈ వయసులోనూ ఎంత హుషారుగా ఉన్నాడో అర్థమవుతోంది’’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. కుర్రాళ్లకే సాధ్యమయ్యే విన్యాసాలను తాతయ్య చేశాడని కొందరు పేర్కొన్నారు.
Enjoy every moment ❤️ pic.twitter.com/sOujOxmEfD
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 29, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..