Virataparvam As A Tribute To Women Hence The Delay
Virata Parvam: ఈమధ్య మన యంగ్ హీరోలు రొటీన్ కథలను కాకుండా కాస్త కొత్తదనంతో కూడిన సినిమాలను ఒకే చేస్తున్నారు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి కూడా ఆ వరుసలోనే ఉంటాడు. అలా వైవిధ్యంతో తెరకెక్కిన సినిమానే విరాటపర్వం. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో రానా నక్షలైట్ పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ గా సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అప్పటి రాజకీయ, సామాజిల అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారని ప్రచారం ఒకటుంది.
కాగా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పాలిట శాపంగా మారింది. అయితే.. ఇందులో కొన్ని ఓటీటీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా విరాటపర్వం కూడా ఓటీటీలతో చర్చలు జరుగుతున్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అవేమీ నిజంకాదని చెప్తున్నారు. అందుకు కారణం ఈ సినిమా ఉమెన్‌హుడ్ కి నివాళిగా ఉండనుందని.. అందుకే ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసినా మహిళా లోకం బ్రహ్మరధం పడుతుందని భావిస్తున్నారు.
విరాటపర్వం సినిమాలో రానా పాత్రతో పాటు కథలో ఎన్నో శక్తిమంతమైన మహిళల పాత్రలు ఉన్నాయట. అందులో సాయిపల్లవి, నందితాదాస్, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీరావు లాంటి నటీమణులంతా ఆయా పాత్రలకు మరింత జీవం పోశారని చెప్తున్నారు. కాస్త ఆలస్యంగానైనా థియేటర్లలో సినిమా విడుదల చేస్తే మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు తప్పక ఉంటాయని మేకర్స్ అంచనా వేస్తున్నారట. అంటే.. థియేటర్లు ఓపెన్ చేసే వరకు విరాటపర్వం లేనట్లే!