Telugu » Latest » Vishals Fans Help Some Poor People Get Married And Vishal Appreciates
Vishal : పేద జంటలకు వివాహం జరిపించిన విశాల్ అభిమాన సంఘం.. అభినందించిన విశాల్..
తాజాగా విశాల్ అభిమానులు 'విశాల్ మక్కల్ నల ఇయక్కం' సంఘం తరపున 11 పేద జంటలకు వివాహం జరిపించారు. వివాహానికి కావాల్సిన అన్ని వస్తువులని, తాళిబొట్లతో సహా ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విశాల్ కూడా విచ్చేసి తన చేతుల మీదుగా ఆ జంటలకు తాళిబొట్లు అందించారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తున్న తన అభిమాన సంఘాలకి చెందిన పలువురికి విశాల్ బంగారు గొలుసులు, బంగారపు ఉంగరాలు బహూకరించాడు. తన చేత్తో విశాల్ తన అభిమానులకి ఆ గోల్డ్ చైన్స్, రింగ్స్ వేశాడు.