Vivek Ranjan Agnihotroi : ‘వ్యాక్సిన్ వార్’.. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఈ సారి ఇండిపెండెన్స్ డేకి గట్టిగానే ప్లాన్ చేశాడుగా..

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ తమ నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు..............

Vivek Ranjan Agnihotroy has announced his next film titled The Vaccine War

Vivek Ranjan Agnihotroi :  తాశ్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్.. అంటూ చాలా సున్నితమైన అంశాలని అద్భుతంగా తెరకెక్కిస్తూ నిజాలని తన సినిమాల ద్వారా జనాలకి తెలియచేస్తున్నారు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇటీవలే కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి కోట్లు కలెక్ట్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే.

ఇప్పుడు ఇదే డైరెక్టర్, నిర్మాత కాంబోలో మరో సినిమా రాబోతుంది. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ తమ నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సరికొత్త టైటిల్ తో రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేసి ఆసక్తికర ట్వీట్ చేశారు డైరెక్టర్.

Senior Heros : పేరుకే సీనియర్ హీరోలు.. కానీ యువ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారుగా..

‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా పోస్టర్ ని పోస్ట్ చేసి.. మీ అందరికి తెలియని ఇండియా పోరాడిన ఒక అద్భుతమైన నిజాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము. సైన్స్, ధైర్యం, విలువలతో ఇండియా గెలిచింది. ఈ సినిమా 2023 ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ కాబోతుంది. 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది” అని తెలిపారు దర్శకుడు వివేక్. దీంతో ఈ సినిమా టైటిల్, ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఏ నిజాలు చూపిస్తాడో, ఎలాంటి ఆసక్తికర విషయాలని తెలియచేస్తాడో అని ఎదురు చూస్తున్నారు.