BBL 2020 : సన్ రైజర్ బౌలర్ రషీద్‌‌కు షాకిచ్చిన షార్ట్.. ఒకే ఓవర్‌లో వీరబాదుడు..!

  • Publish Date - December 13, 2020 / 05:37 PM IST

D’Arcy Short Tears Into Rashid Khan BBL 2020 Match : సన్ రైజర్స్ టీ20 వరల్డ్ బెస్ట్ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ స్పిన్ బౌలింగ్‌ అంటే బ్యాట్సమన్ బెదిరిపోతుంటారు. రషీద్ బంతిని భారీ షాట్లుగా మలచాలంటే తెగ ఇబ్బందిపడిపోతుంటారు బ్యాట్స్ మెన్లు. రషీద్ స్పిన్ బంతుల మాయాజాలాన్ని ఎదుర్కొలేక బ్యాట్స్ మెన్లంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అలాంటి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ డీర్సీ షార్ట్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

సూపర్ ఫాంలో ఉన్న షార్ట్.. రషీద్ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 6 పరుగులతో విజృంభించాడు. అతడు 48 బంతుల్లో 72 పరుగులు తీశాడు.  వేసిన బంతిని వేసినట్టుగానే బౌండరీలు, సిక్సుల మోత మోగించాడు. ఒకే ఓవర్‌లో మూడు సిక్సులు, ఒక ఫోర్ తో ఆకట్టుకున్నాడు. దాంతో  BBL 2020-21 సీజన్‌ మ్యాచ్‌-5లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్‌ జట్టు 11 పరుగుల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ జట్టును ఓడించింది.

ఈ లీగ్ మ్యాచ్‌లో హరికేన్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్టుకు రషీద్‌ ఖాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మంచి ఎకానమీతో రషీద్ ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్పిన్నర్ రషీద్ వేసిన స్పిన్ బంతులను డీర్సీ షార్ట్ భారీషాట్లగా మలిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..