Cloudburst: అందుకే సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ అన్నారు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : July 17, 2022 / 04:31 PM IST
Uttam Kumar Reddy
Cloudburst: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణలో వరదల వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయని, క్లౌడ్ బరస్ట్ ద్వారా భారీ వర్షాలు సృష్టిస్తున్నారని కేసీఆర్ సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం అందుతోందని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ మండిపడ్డారు.
Sri Lanka Crisis: కేంద్రం కీలక నిర్ణయం.. శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష భేటీకి పిలుపు
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. క్లౌడ్ బరస్ట్ చిన్న ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వరదల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చేయడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
