New Zealand vs India: అందుకే తొలి వన్డేలో మా జట్టు ఓడిపోయింది: శిఖర్ ధావన్

‘‘మా ప్రణాళికలను అమలు చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. టామ్ లాథమ్ లాంటి బ్యాట్స్‌మన్ ను కట్టడి చేయడంలో సమర్థంగా బౌలింగ్ చేయలేదు. మొదటి 15 ఓవర్ల వరకు ఫీల్డింగ్ తీరును చూసి అంతా మాకు అనుకూలంగానే పరిస్థితి ఉంటుందని అనుకున్నాం. అయితే, ఇతర మైదానాలతో పోల్చితే ఈడెన్ పార్క్ కాస్త ప్రత్యేకంగా ఉంది. లాథమ్ ను కట్టడి చేయడంలో సమర్థంగా బౌలింగ్ వేయలేదు. దీంతో లాథమ్ అద్భుతంగా రాణించాడు. 40వ ఓవర్ లో బౌండరీలు కొట్టాడు’’ అని శిఖర్ ధావన్ అన్నాడు.

New Zealand vs India: ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇవాళ జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా ఓటమి పాలైన తీరుపై టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. టామ్ లాథమ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ స్కోరు (145) చేయడంతో పాటు కానె విలియమ్సన్ 90 పరుగులు చేసి టీమిండియాను దెబ్బతీయం వెనుక టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం ఉందని అన్నాడు.

నేటి మ్యాచులో న్యూజిలాండ్ కు టీమిండియా 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, కివీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించి తమ జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ… ‘‘మా ప్రణాళికలను అమలు చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. టామ్ లాథమ్ లాంటి బ్యాట్స్‌మన్ ను కట్టడి చేయడంలో సమర్థంగా బౌలింగ్ చేయలేదు.

మొదటి 15 ఓవర్ల వరకు ఫీల్డింగ్ తీరును చూసి అంతా మాకు అనుకూలంగానే పరిస్థితి ఉంటుందని అనుకున్నాం. అయితే, ఇతర మైదానాలతో పోల్చితే ఈడెన్ పార్క్ కాస్త ప్రత్యేకంగా ఉంది. లాథమ్ ను కట్టడి చేయడంలో సమర్థంగా బౌలింగ్ వేయలేదు. దీంతో లాథమ్ అద్భుతంగా రాణించాడు. 40వ ఓవర్ లో బౌండరీలు కొట్టాడు’’ అని శిఖర్ ధావన్ అన్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 తేడాతో వెనుకబడి ఉంది. ఎల్లుండి హామిల్టన్ లోని సెడాన్ పార్క్ లో రెండో వన్డే జరగనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు