Wearing Masks: విమానాల్లో మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై తప్పనిసరి కాదు

విమాన ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. దీనికి ఫైన్లు కూడా విధించబోమని చెప్పింది.

Wearing Masks: విమానాల్లో ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రం తాజాగా నూతన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని కేంద్ర విమానయాన శాఖ ఆదేశించింది. మాస్క్ ధరించాలనే సలహా మాత్రమే ఇస్తామని చెప్పింది.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

ఎవరైనా కోవిడ్ ముప్పు ఉందని భావిస్తే మాస్క్ ధరించవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన ఆదేశాల్ని బుధవారం విమానయాన శాఖ జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను సంప్రదించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విమానాల్లో మాస్క్ ధరించాలి అంటూ వచ్చే ప్రకటనలు, సూచనలు కచ్చితం కాదని కూడా చెప్పింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధించడం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది.

మాస్క్ ధరించడం గురించి విమాన ప్రయాణంలో చెప్పే సూచనలు ప్రయాణికుల భద్రత, క్షేమానికి సంబంధించినవి మాత్రమేనని, జరిమానాలు, కచ్చితమైన నిబంధనలకు సంబంధించి కాదని కేంద్రం ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు