West Bengal local train derails: ఖరగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మళ్లీ లోకల్ రైలు పట్టాలు తప్పింది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్ రైల్వే స్టేషనులో పట్టాలు తప్పింది. లోకల్ రైలు మెల్లగా వెళుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది....
- saleem sk
- Published On : June 11, 2023 / 05:28 AM IST
local train derails
West Bengal local train derails:పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మళ్లీ లోకల్ రైలు పట్టాలు తప్పింది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్(Kharagpur) రైల్వే స్టేషనులో పట్టాలు తప్పింది.(Midnapore-Howrah local train) లోకల్ రైలు మెల్లగా వెళుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే అధికారులు హుటాహుటిన పట్టాలు తప్పిన లోకల్ రైలు వద్దకు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.
Cyclone Biparjoy to intensify : పోర్‌బందర్ తీరాన్ని తాకనున్న బిపర్ జోయ్ తుపాన్
ఈ లోకల్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలేమిటనేది ఇంకా తెలియలేదు. రైల్వే అధికారులు వచ్చి విచారణ చేపట్టారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇటీవల బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత కూడా పలు గూడ్సు రైళ్లు ప్రమాదాలకు గురయ్యాయి. తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ తమ భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
