Lalu Prasad Yadav : సాగు చట్టాలు రద్దు చేసారు సరే..మరణించిన 700మంది రైతుకుటుంబాల సంగతేంటీ? : లాలూ ప్రసాద్

సాగు చట్టాలు రద్దు చేసారు సరే..మరణించిన 700మంది రైతుకుటుంబాల సంగతేంటీ? అని బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ప్రశ్నించారు.

What about the families of the 700-750 farmers who died : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోడీ ప్రకటించారు. రైతులు ఏడాదిపాటు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు వందలాదిమందిరైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా రైతులు తమ ఆందోళన విరమించలేదు. పోరాటం ఆపలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా ప్రధాని మోడీ వ్యవసాయం చట్టాలను రద్దు చేస్తామని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వాటిని రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆందోళనలో పాల్గొన్న 700నుంచి 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు విజయం సాధించిన రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ నల్ల చట్టాల్ని రద్దు చేపటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

కానీ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతన్నల కుటుంబాల పరిస్థితి ఏంటీ?అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సాగు చట్టాలను రద్దు చేశారు సరే..మరి ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబా సంగతేంటీ? అని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించిందని..ఈ నిర్ణయం ముమ్మాటికి రాజకీయ లబ్ది కోసమే అనే ఉద్ధేశంతో లాలూ ఆరోపించారు. వ్యవసాయ రంగంలో వాళ్లు ఓడిపోయారని, ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూస్తారని విమర్శించారు.

అయితే, కరెంటు రేట్లు తగ్గించి..కొత్త విధానంతో ఎంఎస్‌పీ అమలు చేసేంత వరకు రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో రైతులను మభ్యపెట్టడానికే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ఆరోపించారు. ఇటువంటి మభ్యపెట్టే తీరుతో ప్రజలను మోసం చేయలేరనీ..రైతులకు అన్నీ తెలుసు? అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని లాలూ ప్రసాద్ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు