Bollywood actor Manoj Bajpayee: లాలూను కలిశాను, కానీ నేను రాజకీయాల్లోకి రాను..బాలీవుడ్ ప్రముఖ నటుడి తాజా వ్యాఖ్యలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో బీహార్ రాష్ట్రంలో పర్యటించినపుడు తాను రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ లను కలిశాను. కానీ తాను రాజకీయాల్లోకి 200 పర్సంట్ రానని మనోజ్ బాజ్‌పేయి స్పష్టం చేశారు....

Bollywood actor Manoj Bajpayee

Bollywood actor Manoj Bajpayee: ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో బీహార్ రాష్ట్రంలో పర్యటించినపుడు తాను రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ లను కలిశాను. కానీ తాను రాజకీయాల్లోకి 200 పర్సంట్ రానని మనోజ్ బాజ్‌పేయి స్పష్టం చేశారు. తాను లాలూయాదవ్ ను కలిసినప్పటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రజల్లో ఊహాగానాలు చెలరేగాయని మనోజ్ చెప్పారు.

Earthquake Strikes Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..బయటకు పరుగులు తీసిన జనం

తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్న అస్సలు ఉత్పన్నం కాదని మనోజ్ బాజ్ పేయి చెప్పారు. బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా బెల్వా గ్రామానికి చెందిన బాజ్ పేయి నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం ప్రమోషన్ కోసం పాట్నా వచ్చారు. బీహార్ వాసి అయిన మనోజ్ బాజ్ పేయి గత ఏడాది సెప్టెంబరులో బీహార్‌లో ఆయన పర్యటించినప్పుడు, లాలూ ప్రసాద్‌ను ఆయన నివాసంలో కలిశారు.

Early Lok Sabha Polls: ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

మూడు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్న బాజ్‌పేయి మాట్లాడుతూ తాను సినీనటుడినని,నటుడిగా మాత్రమే ఉంటాను… రాజకీయాల్లో చేరాలనే ప్రశ్నే లేదన్నారు. తన సొంత రాష్ట్రమైన బీహారులో చలనచిత్ర నిర్మాణానికి అపార అవకాశముందని ఆయన చెప్పారు. బీహార్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రోత్సహించేలా కొత్త ఫిలిం పాలసీని తీసుకు రావాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.