Car
Unconscious Driver : వాహనాలు నడుపుతున్న సమయంలో అనుకోకుండా కొంతమంది అపస్మారక స్ధితిలోకి వెళ్ళటం, ఉన్నట్టుండి గుండెపోటుకు గురవ్వటం వంటి ఘటనలు నిత్యం ఏదో చోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనల సమయంలో వాహనం అదుపుతప్పటం, అందులోని వారు ప్రమాదాలకు గురవ్వటాన్ని మనం చూస్తుంటాం. అయితే తాజాగా ఈ తరహా ఘటనే ఒకటి వెలుగు చూసింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి షడన్ గా అపస్కారక స్ధితిలోకి చేరుకోవటం, కారు నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఓ హైవేపై కారు వెళుతుంది. అయితే అందులోని డ్రైవర్ స్టీరింగ్ పై వరిగిపోయి ఉన్నాడు. అంతలోనే సడన్ గా కారు రోడ్డు పక్కకు వచ్చి నిలిచిపోయింది. అక్కడ ఉన్న స్ధానికులు కొద్ది సేపటి వరకు ఏంజరిగిందో అర్ధంకాక కారువైపు చూడసాగారు. కారు నిలిచిపోయినా అందులోని డ్రైవర్ స్టీరింగ్ పై అలాగే తలవాల్చి ఉండటంతో కారు వద్దకు వెళ్ళారు. డోరు తెరిచే ప్రయత్నం చేయబోగా లాక్ వేసి ఉంది.
కారుకు ఉన్న పక్క అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో..సుత్తితోపాటు, ఇతర ఇనుపవస్తువులను ఉపయోగించి కారు వెనుకవైపు అద్దం పగుల గొట్టి ఓఅమ్మాయిని కారులోకి పంపారు. కారులోకి వెళ్ళిన యువతి లోపలి నుండి డోర్ల లాక్ ను ఓపెన్ చేసింది. స్టీరింగ్ పై పడి ఉన్న అతడిని తట్టి లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తొలుత మద్యం సేవించాడేమోనని అనుమానించిన స్ధానికులు ఆతరువాత అతడిని చూసి ప్రమాదంగా నిర్ణయానికి వచ్చారు.
స్ధానికులు వెను వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు..అదే క్రమంలో బాధితుడి ఫోన్ నుండి అతని భార్యకు ఫోన్ చేసిన జరిగిన ఘటన వివరించారు. అంబులెన్స్ వచ్చేంత వరకు అతని స్ధానికులు సపర్యలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను చూసిన వారంతా స్ధానికులు చేసిన పనిని తెగమెచ్చుకుంటున్నారు. ఆపద సమయంలో స్పందించిన తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అట్లాంటాలోని జార్జియాలో చోటు చేసుకుంది.