WhatsApp lets you change photo upload quality, here is how
WhatsApp Photo Quality : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. వాట్సాప్ ఇప్పుడే కమ్యూనిటీలు, ఇన్-చాట్ పోల్స్ వంటి ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పటినుంచి వాట్సాప్ గ్రూప్‌లో గరిష్టంగా 1024 మంది యూజర్లు చేరేందుకు అనుమతిస్తుంది. అంతేకాదు.. ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్‌లో 32 మంది యూజర్లను కూడా చేర్చుకోవచ్చు. వాట్సాప్ ఫోటో అప్‌లోడ్ క్వాలిటీ (WhatsApp Photo Quality)ని కూడా మార్చడానికి యూజర్లకు అనుమతిస్తుంది.
ఎప్పటినుంచో వాట్సాప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. WhatsApp యాప్ సెట్టింగ్‌లలో స్పెషల్ ఫొటో అప్‌లోడ్ క్వాలిటీ సెక్షన్ యాడ్ చేసింది. మీ స్నేహితులకు, ఇతర కాంటాక్టులకు బెస్ట్ క్వాలిటీ ఫొటోలను పంపేందుకు యూజర్లుకు అనుమతిస్తుంది. సెకండరీ “Data Saver” ఆప్షన్ కూడా ఉంది. ప్రాథమికంగా వాట్సాప్‌లో మీ డేటాను ఎక్కువగా వినియోగించదని చెప్పవచ్చు.
సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా ఫొటోను అప్ లోడ్ చేసినప్పుడు అది ఆటోమాటిక్ గా కంప్రెస్ అవుతుంది. అప్పుడు ఫొటో క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు పంపే ఫొటో ఎవరికైనా పంపడానికి మీ డేటాను ఎక్కువ మొత్తంలో వినియోగించదు. Auto అనే మూడవ ఆప్షన్ కూడా ఉంది.
WhatsApp lets you change photo upload quality, here is how
అదే ప్రాథమికంగా యాప్ బెస్ట్ క్వాలిటీ ఫొటోలను పంపాలా లేదా డేటా సేవర్ ఆప్షన్‌తో పంపాలా అని నిర్ణయించుకోవడానికి అనుమతిస్తుంది. బెస్ట్ క్వాలిటీ ఫొటోలు సైజులో పెద్దవి పంపడానికి సాధారణం కన్నా ఎక్కువ సమయం పడుతుంది. WhatsApp అకౌంట్లో యూజర్లు తమ ఫొటో క్వాలిటీ తగ్గకుండా ఎవరికైనా హై క్వాలిటీతో పంపడానికి Google డిస్క్‌కి ఫైల్‌లను అప్‌లోడ్ చేసుకోవడానికి ఎంచుకోవచ్చు.
WhatsApp మీ స్మార్ట్‌ఫోన్ Wi-Fiని ఉపయోగిస్తున్నప్పుడు ఫొటోల కోసం బెస్ట్ క్వాలిటీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీ డివైజ్ మొబైల్ డేటాలో ఉంటే.. మీ మొబైల్ డేటాను Save చేయడానికి యాప్ ఆటోమేటిక్‌గా ‘Data Saver’ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ మెసేజింగ్ యాప్ Settings సెక్షన్‌లో కనిపిస్తుంది.
ఎవరైనా WhatsAppని ఓపెన్ చేసి సెట్టింగ్‌ల ఆప్షన్ యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకు మీరు త్రి డాట్స్ ఐకాన్ నొక్కండి, ఆపై Storage & Dataపై మళ్లీ Tap చేయండి. మీరు స్క్రీన్ కింది భాగంలో Photo Upload Quality ఫీచర్‌ను చూడవచ్చు. డిఫాల్ట్‌గా ఆటో ఆప్షన్‌గా సెట్ చేసి ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..