WhatsApp Profile Feature _ WhatsApp Avatar Profile Photo feature is coming soon to all users, available in beta
WhatsApp Profile Feature : ప్రముఖ వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో అతి త్వరలో కొత్త ఫీచర్ వస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటోల కోసం “Avatar”ని సెట్ చేసుకోవచ్చు. WABetaInfo ప్రకారం.. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. అవతార్‌లతో మెసేజింగ్ యాప్ మొత్తం యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత డెవలప్ చేయనుంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ త్వరలో ఈ అవతార్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, iOS, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి తేనుందని నివేదిక సూచిస్తుంది.
Android, iOS, డెస్క్‌టాప్‌ల కోసం WhatsApp బీటాలో కొత్త WhatsApp ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఈ కొత్త అవతార్ ఫీచర్ అధికారికంగా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త వాట్సాప్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం.
WhatsApp Profile Feature : వాట్సాప్ అవతార్ ఫీచర్ అంటే ఏంటి?
నివేదిక ప్రకారం.. వాట్సాప్ ప్రస్తుతం అవతార్ ప్రొఫైల్ ఫొటో అనే ఫీచర్‌పై పని చేస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రొఫైల్ ఇమేజ్‌గా అవతార్‌ను సెట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. Android, iOS, డెస్క్‌టాప్ కోసం WhatsApp బీటా ప్యూచర్ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది.
WhatsApp Avatar Profile Photo feature is coming soon to all users, available in beta
WhatsApp సమాచార పోర్టల్ Android కోసం WhatsApp బీటా నుంచి ఫీచర్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసింది. వాట్సాప్ యూజర్లు ఈ అవతార్‌ను ఎలా వినియోగించుకోవచ్చు. బ్యాక్‌డ్రాప్ రంగును ఎంచుకోవచ్చు.. అలాగే ప్రొఫైల్ ఫొటోగా అవతార్‌ను ఎలా సెట్ చేసుకోవచ్చునేది తెలుసుకోవచ్చు.
Whatsapp అవతార్ ప్రొఫైల్ ఫోటో రిలీజ్ ఎప్పుడంటే? :
ఈ ఫీచర్ ఇప్పటికే WhatsApp iOS, డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ అతి త్వరలో అందరి వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. WhatsApp లాంచ్ తేదీ సహా ఫీచర్ గురించి ఎలాంటి నిర్దిష్ట వివరాలను వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని, యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చునని గమనించాలి.