WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై కాల్ హిస్టరీని యూజర్లు ట్రాక్ చేయొచ్చు..!

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్నారు. Meta-యాజమాన్య సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది.

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్నారు. Meta-యాజమాన్య సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. WaBetaInfo లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని ట్రాక్ చేసే సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.

తెలియని వారి కోసం.. WaBetaInfo అనేది WhatsApp కొత్త, రాబోయే ఫీచర్‌లను గుర్తించే ఆన్‌లైన్ ట్రాకర్ అందుబాటులో ఉంది. నివేదిక ప్రకారం.. WhatsApp Windows 2.2246.4.0 అప్‌డేట్ కోసం మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో బీటాను రిలీజ్ చేసింది. డెస్క్‌టాప్ యాప్‌లోనే కాల్ హిస్టరీని నిర్వహించగల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్‌టాప్ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. మీరు WhatsAppను ఉపయోగించినప్పుడు ఓపెన్ చేసే కొత్త కాల్‌ల ట్యాబ్‌ను రిపోర్టు చూపిస్తుంది. కొత్త ట్యాబ్‌లో యూజర్ల వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో వారి కాల్ హిస్టరీ లిస్టును చూడవచ్చు. కాల్ కార్డ్‌ని ఓపెన్ చేయడం ద్వారా కాల్ గురించిన సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు.

WhatsApp to soon allow users to manage call history within the app

ఈ యాప్ బీటా వెర్షన్ కావునా.. కాల్ హిస్టరీ మీ మొబైల్ డివైజ్‌లో ఉన్న దానితో ఇన్‌స్టంట్ సింక్ కాకపోవచ్చునని నివేదిక పేర్కొంది. వాస్తవానికి.. స్థానిక డెస్క్‌టాప్ యాప్ నుంచి చేసిన కాల్‌లు మీ ఫోన్‌లో కనిపించకపోవచ్చు. భవిష్యత్తులో ఈ బగ్ సమస్య పరిష్కరించే అవకాశం ఉంది.

Microsoft స్టోర్ నుంచి Windows 2.2246.4.0 అప్‌డేట్ కోసం WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్ సైడ్‌బార్‌లోని కాల్స్ ట్యాబ్ కొంతమంది బీటా టెస్టర్‌లను రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. WhatsApp డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

స్క్రీన్ లాక్ అని పిలిచే ఈ ఫీచర్ ఏదైనా యూజర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. వాట్సాప్‌కు అదనపు భద్రతా లేయర్ అందిస్తుంది. యూజర్ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అతని/ఆమె డివైజ్ ఉపయోగించనప్పుడు అనధికారిక యాక్సెస్‌ను అందిస్తుంది. WaBetaInfo నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజీలో ఉంది. భవిష్యత్తులో కొంతమంది బీటా టెస్టర్లకు రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Infinix Hot 20 5G Series : ఇన్ఫినిక్స్ హాట్ 20 5G సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు