Mohan Bhagawat-Dalai Lama : దలైలామాను కలిసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమయ్యారు. గంటకుపైగా చర్చలు జరిపారు.

Mohan Bhagawat meets Dalai Lama : RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను కలిసారు. గంటకు పైగా చర్చలు జరిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలోని దలైలామా నివాసానికి వెళ్లిన మోహన్ భగవత్ గంటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు. కాగా కరోనా ముప్పుతో దలైలామా మొదట్లో మోహన్ భగవత్ తో కలవటానికి అనుమతి ఇవ్వలేదు.. కానీ..తరువాత ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు.

Read more : Short Day of The Year: ఈ ఏడాదికి అత్యంత చిన్న రోజు ఇవాళే

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల, కాంగ్రాలో ఐదు రోజుల పర్యటనలో భగవత్ ప్రవాస టిబెటన్ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ ను కూడా కలిశారు. ఈ సందర్భంగా దలైలామాను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై దలైలామాతో చర్చించినట్టు తెలిపారు.

Read more : Train Engine‌ Theft : ఏకంగా రైలు ఇంజిన్‌నే దొంగిలించి అమ్మేసిన రైల్వే ఇంజినీర్‌

కాగా దలైలామా సాధారణంగా ఏ నాయకులను పెద్దగా కలవరు.ఎందుకంటే బౌద్ధ మత గురువు అయిన ఆయనపై రాజకీయ ముద్ర పడకూడదని అనుకుంటుంటారు. అందుకే ఇప్పటి వరకు ఆయన భారత్ లో శరణార్ధిగా ఉంటున్నా..ఎవ్వరికి తనను కలవటానికి అనుమతి ఇవ్వరు. ఈక్రమంలో మోహన్ భగత్ తనను కలవాలని ఎన్నిసార్లు అడిగినా అనుమతి ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు అనుమతి లభించటంతో సోమవారం, డిసెంబరు 20, హిమాచల్ ప్రదేశ్‌లోని మక్లీయోడ్‌గంజ్‌లోని అతని ఇంటి గడెన్ ఫోద్రాంగ్‌లో దలైలామాను కలిశారు.చర్చలు జరిపారు.

ట్రెండింగ్ వార్తలు