భారత్‌లో రెండు వైరల్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ఇటీవలే తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది. అందులో ఒకటి.. షార్ట్ వీడియో మేకింగ్ యాప్ ‘Mitron’.. రెండోది చైనీస్ యాప్స్ ‘Remove China Apps’ అప్లికేషన్. మన ఫోన్లలోని చైనీస్ యాప్స్ తొలగించేందుకు ఈ అప్లికేషన్ వినియోగిస్తుంటారు. ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ రెండు అప్లికేషన్లను గూగుల్ తొలగించింది. దీనికి సంబంధించి గూగుల్, డెవలపర్స్ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. ఇప్పుడు దీనిపై గూగుల్ ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది.
భారతదేశంలో రూపొందించిన ఈ రెండు యాప్‌లను తొలగించాలనే నిర్ణయంపై సెర్చ్ ఇంజిన్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పాలసీలను ఎక్కువ సార్లు ఉల్లంఘించడంతో మిత్రాన్ యాప్ ను స్టోర్ నుంచి తొలగించినట్టు ఆండ్రాయిడ్, గూగుల్‌పే వైస్ ప్రెసిడెంట్ సమీర్ సామత్ తెలిపారు. రిమూవ్ చైనా యాప్స్ అప్లికేషన్ కూడా ఇతర యాప్స్ ను ఎలాంటి వెరిఫైబుల్ సెక్యూరిటీ సర్వీసు లేకుండానే యూజర్లను తమ ఫోన్ల నుంచి రిమూవ్ చేసుకునేలా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
అందుకే ఈ వారంలో మిత్రాన్, చైనీస్ రిమూవ్ యాప్ తొలగించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అందులోనూ టెక్నికల్ పాలసీ ఉల్లంఘనలు ఎక్కువగా ఉండటంతో ప్లే స్టోర్ నుంచి నిబంధనల ప్రకారం తొలగించినట్టు స్పష్టం చేశారు. తొలగించిన యాప్స్ తిరిగి ప్లే స్టోర్ లోకి రీసబ్మిట్ చేసేందుకు వీలుగా డెవలపర్లతో కలిసి తలెత్తిన సమస్యలను ఫిక్స్ చేస్తున్నామని చెప్పారు. యాప్‌లో పాలసీ ఉల్లంఘనలకు కారణమైన సాంకేతిక సమస్యను ఫిక్స్ చేసిన తర్వాత తిరిగి ప్లే స్టోర్ లోకి రీస్టోర్ చేసేలా డెవలపర్లకు సూచనలు చేసినట్టు సామత్ తెలిపారు. దీని ప్రకారం.. మిత్రాన్ యాప్ తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లోకి వస్తుందనే సంకేతంగా కనిపిస్తోంది.
ప్రముఖ ట్రెండింగ్ యాప్ టిక్ టాక్‌కు మిత్రాన్ యాప్ నేరుగా పోటీనిస్తోంది. టిక్ టాక్ మాదిరిగానే సర్వీసులను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. BGR ప్రకారం.. మిత్రాన్ యాప్ ను ఇప్పటివరకూ 5 మిలియన్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్లే స్టోర్ లో ఈ యాప్ తొలగించడానికి ముందు 4.7 రేటింగ్‌తో ఉంది. చైనీస్ వస్తువులతో పాటు యాప్స్ కూడా భారత్ నుంచి బైకాట్ చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో మిత్రాన్ యాప్ పాపులర్ అయింది. గూగుల్ యాప్ పాలసీలకు సంబంధించి పరిశీలిస్తే మిత్రాన్ యాప్ తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చే అవకాశం ఉండదు.