Wife Found By 18th Husband While 19th Marriage
China Marriage Bureau: కరోనా వైరస్ గురించి తలచుకుంటే చాలు ముందుగా ప్రపంచమంతా తిట్టుకొనేది చైనానే. అక్కడ నుండే వచ్చిన కరోనా మహమ్మారి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తున్నది. అన్నిటికి మించి కోట్లాది మందిని పొట్టనపెట్టుకుంది. దీంతో ఒకవిధంగా ప్రపంచమంతా చైనా ఒక భావనతో చూడడం మొదలుపెట్టింది. కాగా.. ఇప్పటి వరకు చైనా వస్తువులంటే నాసిరకంగా ఉంటాయని.. త్వరగా పాడైపోతాయని మనం నిత్యం సెటైర్లు వేసుకుంటుంటాం.
ప్రపంచవ్యాప్తంగా దొరికే టాప్ బ్రాండ్స్ అన్నిటికి చైనాలో కాపీ బ్రాండ్స్ సృష్టించేస్తుంటారు. అంతగా ఇక్కడ డూప్లికేట్ సరుకు దొరుకుతుందని పేరు. కానీ.. వస్తువులే కాదు చైనాలో పెళ్లిళ్లు.. మ్యారేజ్ బ్యూరోలు కూడా డూప్లికేట్ చేసేస్తున్నారు. ఒక మ్యారేజ్ బ్యూరో ఏకంగా ఓ యువతితో 19 మంది యువకులకు పెళ్లిళ్లు చేసింది. తీరా 19వ పెళ్లి జరుగుతుండగా 18వ భర్త పేస్ బుక్ లైవ్ లో చూసి షాక్ తిని తనకు పెళ్లి చేసిన మ్యారేజ్ బ్యూరో దగ్గరకి వెళ్తే బండారం బయటపడింది.
చైనాలో ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం ఒక మ్యారేజ్ బ్యూరోను సంప్రదించి దాదాపు 17 లక్షల ఎదురు కట్నం ఇచ్చి మరీ వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు నెలల పాటు వీరి కాపురం కూడా సజావుగానే సాగింది. ఆ తర్వాతే యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళింది. ఈ మధ్యనే ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి జరుగుతుండగా పేస్ బుక్ లో లైవ్ వచ్చింది. అది చూసిన భర్త షాక్ తిని మ్యారేజ్ బ్యూరో దగ్గరకి వెళ్లి ఆరాతీస్తే బండారం బయటపడింది. ఆ యువతికి ఇది 19వ పెళ్లి కాగా మోసపోయిన యువకులలో తన నెంబర్ 18 అని తెలిసింది.