కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ప్యాకేజీ – 4లో తమకు కూడా ఏదైనా మేలు జరిగే అంశాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. భారతదేశంలో కరోనా వైరస్ విస్తరించడంతో ఆర్థిక రంగం కుదేలు అయిపోయింది. ఎంతో మంది కష్టాలు పడుతున్నారు.
వీరిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్నారు. చివర విడత ప్యాకేజీని 2020, మే 17వ తేదీ ఆదివారం 11 గంటలకు వివరాలను వెల్లడించనున్నారు.
తమకు ఉపశమనం కలిగించే వార్త వింటామా అని ఎదురు చూస్తున్నారు మధ్యతరగతి వాసులు. ఏదైనా తమకు ప్యాకేజీ ప్రకటిస్తారని కొంతమంద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికులు, రైతులు, వీధి వ్యాపారులు, వ్యాపారం, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే వారికి కొన్ని చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. మే 16వ తేదీన కొన్ని రంగాలకు ఉపశమనం కలిగించేలా ప్రకటన చేశారు.
ఈ క్రమంలో పన్ను చెల్లింపుల విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడనుందనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. లోన్లపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. కానీ దీనికి మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. EMI కింద వడ్డీని తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో చూడాలంటే..కొద్ది గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది.