Prashant Kishor: ఆ పార్టీతో కలిసి ఇకపై పనిచేయను: ప్రశాంత్ కిషోర్

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదని చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). బిహార్‌లోని వైశాలిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.

Prashant Kishor on bihar cm promises

Prashant Kishor: భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదని చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). బిహార్‌లోని వైశాలిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడైందన్నారు. ‘‘ఎన్నికల్లో నా విజయాల పరంపరకు బ్రేక్ వేసిన పార్టీ కాంగ్రెస్. నా ట్రాక్ రికార్డు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ పార్టీ బాగుపడకపోగా, నాకు నష్టం కలిగించింది. పదేళ్లలో నేను పదకొండు ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. కానీ, ఒక్క ఎన్నికలో మాత్రమే నేను గెలిపించలేకపోయా.

Bangladesh woman: ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిన యువతి

అదే 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నిక. ఆ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయింది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో, 2015లో బీహార్‌లో జేడీయూతో గెలిచాం. 2017లో పంజాబ్‌లో, 2019లో జగన్ మోహన్‌రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచాం. కేజ్రీవాల్‌తో 2020లో ఢిల్లీలో, 2021లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గెలిచాం. కానీ 2017లో కాంగ్రెస్‌తో కలిసి యూపీలో ఓడిపోయాం’’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై పీకేకు, కాంగ్రెస్‌కు మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ పార్టీలో చేరకుండానే పీకే బయటకొచ్చేశారు. తాజాగా బిహార్‌లో కొత్త పార్టీ ఏర్పాట్లలో ఉన్నారు.