FASTag లేకుంటే…రెండు రెట్లు ఫైన్

  • Publish Date - May 17, 2020 / 10:03 AM IST

FASTag లేదా ? ఉన్నా పనిచేయడం లేదా ? అయితే..మీ జేబుకు భారీగానే చిల్లు పడనుంది. రెండు రెట్ల జరిమానాను ముక్కు పిండి వసూలు చేస్తారు. ఫాస్టాగ్ లేన్ లోకి వచ్చి వెళ్లేందుకు ప్రయత్నిస్తే..వెహికల్ క్యాటగిరి కింద..టోల్ ఫీజును రెండు రెట్లు వసూలు చేస్తారు. దీనికి సంబంధించి..రోడ్డు రవాణా..హైవేల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియత్రించడం కోసం..వాహనాలు వెయిట్ చేయకుండా ఉండేందుకు..నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించడానికి… కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం FASTag కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఫాస్టాగ్ లేకపోతే..కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో కొంతమంది వాహనదారులు FASTagను కొనుగోలు చేశారు. ఈ గడువును పెంచుతూ వచ్చారు. అయినా..చాలా వరకు ఫాస్టాగ్ లేకుండానే..హైవేలపై తిరుగుతున్నాయి. ఇక నుంచి అలా కుదరదని తేల్చిచెప్పింది. 

FASTag కలిగిన వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఈ సౌకర్యం కలిగిన వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. దేశంలోని 23 బ్యాంకులతో పాటు, నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషిన్లు, ఎంపిక చేసిన ఏజెన్సీలు, బ్యాంకు బ్రాంచీలు ఫాస్టాగ్ లు అందచేశారు.

వాహన దారులు రూ. 200 చెల్లించి…వన్ టైం జాయినింగ్ ఫీజు చెల్లించి..కేవేసీ పత్రాలతో ఫాస్టాగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం..ఫాస్టాగ్ స్టిక్కర్ వస్తుంది. ఈ స్టిక్కర్ ను వాహనం ముందు భాగం అద్దానికి అతికించుకోవాల్సి ఉంటుంది. టోల్ ప్లాజా నంచి వెళ్లిన సమయంలో ఈ స్టిక్కర్ ను అక్కడున్న సిబ్బంది..స్కానింగ చేస్తారు. ముందుగానే రిజిష్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్..వాలెట్ నుంచి ఆటోమెటిక్ గా డబ్బులు కట్ అవుతాయి. వాలెట్ ను నిర్దిష్టంగా టాపప్ చేసుకోవాల్సి ఉంటుంది.