woman belly dance : బెల్లీ డ్యాన్స్‌తో నెటిజన్ల హార్ట్‌ కొల్లగొట్టిన శ్రేయ

ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్‌కి బెస్ట్ స్టేజ్‌గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

woman belly dance

Viral Video : ఇటీవల కాలంలో ఆడవారు రకరకాల డ్యాన్సులతో తమ టాలెంట్ చూపిస్తూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు. తాజాగా బెల్లీ డ్యాన్స్‌తో ఓ లేడీ చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంది.

Woman break dance in saree : చీరకట్టుతో.. హైహీల్స్‌తో బ్రేక్ డ్యాన్స్ ఇరగదీసిన మహిళ వీడియో వైరల్

చీర కట్టుతో జిమ్ చేస్తూ డ్యాన్స్.. చీర కట్టులో బ్రేక్ డ్యాన్స్ ఇలా క్లిష్టమైన డ్యాన్సుల్ని కూడా అలవోకగా చేస్తూ ఆడవారు అదుర్స్ అనిపించుకుంటున్నారు. శ్రేయ అనే మోడల్ మరియు బెల్లీ డ్యాన్సర్ తాను చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో shimmybysharma షేర్ చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. రెమో, సెలీనా గోమెజ్ డ్యూయెట్ సాంగ్ ‘కామ్ డౌన్’ రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడ్డారు. ఈ బీట్‌కు చాలామంది డ్యాన్సులు చేస్తూ వీడియోలు పోస్టు చేశారు. అయితే ఇదే పాటకు రీసెంట్‌గా శ్రేయ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.

Viral Video : అమేజింగ్ టాలెంట్.. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్.. వీడియో వైరల్

‘నేను బెల్లీ డ్యాన్స్ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాను’ అనే శీర్షికతో శ్రేయ ఈ వీడియోను పంచుకున్నారు. గ్లోబల్‌గా ఎంతో పాపులర్ అయిన ‘కామ్ డౌన్’ పాటకు శ్రేయ నలుపు రంగు డ్రెస్సును ధరించి డ్యాన్స్ చేశారు. ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా శ్రేయ చేసిన డ్యాన్స్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.