భర్తను భుజాలపై ఎక్కించుకుని తిరగాలి..అత్తింటి వారి శిక్ష

  • Publish Date - June 21, 2020 / 07:12 AM IST

ఇంటి నుంచి వెళ్లి..వారం రోజుల తర్వాత వచ్చిందని..వేరేవారిని ప్రేమిస్తుందనే అనుమానంతో అత్తింటి వారు..కోడలికి విచిత్రమైన శిక్షను విధించారు. భర్తను భుజాల మీదకు ఎక్కించుని మార్కెట్ అంతా తిరిగి రావాలని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమి లేక..భర్తను భుజాన ఎక్కించుకుని తిరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా డిస్ట్రిక్ లోని కళ్యాణపుర పీఎస్ పరిధిలోని ఖేడా గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వివాహిత…జూన్ 13వ తేదనీ పొరుగున ఉన్న గ్రామానికి వెళ్లింది. తిరిగి అత్తింటికి రాలేదు. వారం తర్వాత..ఇంటికి వచ్చింది.

అప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్న అత్తింటి వారు వింత శిక్షను విధించారు. భర్తను భుజాలపై ఎక్కించుకుని మార్కెట్ అంతా తిరిగి రావాలని ఆదేశించారు. ఆమె వేరెవరినో ప్రేమిస్తోందని అనుమానంతో అత్తింటి వారు ఈ శిక్షను వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి..వీడియోలు తీశారు స్థానికులు. అందరూ చూస్తుండి పోయారే కానీ..ఎవరూ దీనిని అడ్డుకోలేదు. ఈ సమాచారం..పోలీసులకు తెలిసింది. ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. 
 

 

Read: సూర్యగ్రహణంతో కరోనా వైరస్ అంతం, వాస్తవం ఎంత