Found a friend on Instagram : 18 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహాన్ని ఇన్‌స్టాగ్రామ్ కలిపింది

సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహాలు మళ్లీ చిగురిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం స్కూల్ డేస్‌లో మిస్ అయిన ఫ్రెండ్‌ని ఒక అమ్మాయి ఇన్ స్టాగ్రామ్‌లో మళ్లీ ఎలా కలిసిందో చదవండి. మనసుని హత్తుకుంటుంది.

Viral Video

Viral Video : వాళ్లిద్దరిదీ స్కూల్లో స్నేహం. విడిపోయి 18 సంవత్సరాలు అవుతోంది. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలీదు. అందులో ఒకరు తన స్నేహితురాల్ని కలవాలి అనుకుంది. అందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో అన్వేషణ ప్రారంభించింది. ఆమె అన్వేషణ ఫలించిందా?

Artist amazing woodwork : చెక్కపై అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్ట్ వీడియో వైరల్

నేహ, లక్షిత LKG ఫ్రెండ్స్. స్కూలు చదువులు అయిపోయాక విడిపోయారు. ఆ తరువాత తలో చోట స్థిరపడ్డారు. నేహకి తన చిన్ననాటి స్నేహితురాలు లక్షిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలనిపించింది. అంతే స్కూల్లో తీయించుకున్న గ్రూప్ ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫైండింగ్ లక్షిత’ అనే అకౌంట్ క్రియేట్ చేసి ‘నేను చాలాకాలంగా మిస్ అవుతున్న చిన్ననాటి స్నేహితురాలిని వెతికే పనిలో ఉన్నాను.. లక్షిత వయస్సు 21, తన బ్రదర్ కునాల్’ అని బయోలో రాసింది.

 

 

అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షిత అనే పేరున్న అమ్మాయిలందరికీ నేహా మెసేజ్ చేసింది. చివరికి నేహ ప్రయత్నం ఫలించింది. లక్షితని @lakshita_jetawat కనుగొంది. ఆమెను కనుగొన్న తర్వాత నేహా ‘నిన్ను కనుక్కోవడం చాలా కష్టమైంది.18 సంవత్సరాలు నీతో టచ్ లో లేనంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు 2006 లో లక్షిత పేరుతో ఫ్రెండ్ ఉండేది. తను జైపూర్ వెళ్లిపోయింది. అప్పటి నుంచి తన కాంటాక్ట్ మిస్ అయ్యాను. తన ఇంటిపేరు గుర్తు లేదు.. చివరికి ఇలా..’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టు ఎంతో మనసుని టచ్ చేసింది. చాలామంది తమ కామెంట్లతో స్పందించారు.

Woman break dance in saree : చీరకట్టుతో.. హైహీల్స్‌తో బ్రేక్ డ్యాన్స్ ఇరగదీసిన మహిళ వీడియో వైరల్

 

చాలామంది తమ చిన్ననాటి స్నేహితుల్ని కనుగొనడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియాని ఎలా ఉపయోగిస్తే అలాంటి ఫలితాలు ఇస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.. కోల్పోయిన స్నేహితుల్ని తిరిగి కలుసుకోవచ్చు. నేహ లాగ చాలామంది తమ స్నేహితుల్ని సోషల్ మీడియా ద్వారా తిరిగి కలుసుకుని ఉండచ్చు.

ట్రెండింగ్ వార్తలు