×
Ad

ఇదోరకం మోసం..: Rs.250 ఫుడ్ ఆర్డర్ చేసి..రూ.50వేలకు అడ్డంగా బుక్ అయిపోయిన మహిళ

  • Published On : December 28, 2020 / 12:47 PM IST

woman loses 50 thousand rupees after trying to buy 250 rupees meal : ఆకలేస్తోంది..తినటానికి వెంటనే ఏదోకటి కావాలి. మరి చేయాలి? ఈరోజుల్లో ఇదే పెద్ద విషయమే కాదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు ‘నెట్టింటిలో ఒక్క క్లిక్ చేస్తే చాలా నట్టింటి’లో వాలిపోతుంది మనం తినాలనుకున్న ఫుడ్. దీంతో ఇంట్లో వండుకునేది తక్కువ ఆన్‌లైన్ ఆర్డర్స్ ఎక్కువవుతున్నాయి. ఈ ఆన్‌లైన్ ఆర్డర్స్ లో ఆఫర్లు కూడా ఉంటాయి. వాటిలో మోసాలు కూడా ఉంటాయి. అలా పాపం ఓ మహిళ ఆఫర్ ఫుడ్ కోసం ఆర్డర్ చేసి అడ్డంగా బుక్ అయిపోయింది.

సోషల్ మీడియాలో ఓ ఫుడ్ కు సంబంధించి ఆఫర్ కనిపించింది. కేవలం రూ.250లకే మెంబరాఫ్ వెరైటీస్ అనే ఆఫర్‌ను చూసి ఇష్టపడి బుక్ చేసుకునేందుకు యత్నించిందామె. అయితే దానిని కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో ఓ రూ.10 అడ్వాన్స్ పేమెంట్ చేయాలని రూల్ ఉంది. దానికోసం ఓ లింక్ కూడా ఆమెకు వచ్చింది.

ఓ పక్క ఆకలితో ఉందేమో పాపం భోజనం గబగబా బుక్ చేయాలనే తొందరలో ఆమె ఆ లింక్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేసింది. దీనికోసం ఆమె తన డెబిట్ కార్డ్, పిన్ ఎంటర్ చేసింది. అంతే భోజనం ఆర్డర్ బుక్ అవడం పక్కనపెడితే..తన ఖాతాలో ఉన్న రూ.50వేల రూపాయలు మొత్తం మాయమయ్యాయి.

ఒకే ఒక్క క్లిక్ తో మొత్తం రూ.50వేలు హుష్ కాకి అయిపోయాయి. దీంతో ఆమె బేరారెత్తిపోయింది. ఆకలి సంగతి మరిచిపోయింది. గబగబా పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్ మోసాలు ఇన్ని జరుగుతున్నా.. అజాగ్రత్తగా ఉండడం సరందికాదని ఆమెకు పదే పదే సూచించారు. దీంతో ఆమె ఇకనుంచి జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దీనిపై దర్యాప్తు చేసి మీ డబ్బుని రికవరీ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి పంపించారు.