టిక్ టాక్ లో పరిచయం, ఆపై అత్యాచారం.. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు,

  • Publish Date - May 18, 2020 / 03:21 AM IST

టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు,

టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు, అక్రమ సంబంధాలకు కేరాఫ్ గా మారుతోంది. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తోంది. వ్యక్తులను హంతకులుగా మారుస్తోంది. టిక్ టాక్ లో ఏర్పడిన పరిచయ్యం అత్యాచారానికి దారి తీసింది. హైదరాబాద్ లో ఈ దారుణం జరిగింది. 

ఇంటికి పిలిపించి అత్యాచారం:
టిక్ టాక్ లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె జీవితం నాశనం చేసి పారిపోయాడు. పాతబస్తీలో నివసించే ఓ యువతికి(27) తలాబ్ కట్టలో నషేమన్ నగర్ లో నివసించే అక్బర్ షా(34) అనే వ్యక్తితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు యువతికి మాయమాటలు చెప్పిన అక్బర్..ఆమెను టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి పిలిచాడు. అక్కడే ఆమెను రేప్ చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని కొంతమంది పెద్దల సమక్షంలో మాటిచ్చాడు. మరోసారి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నారు:
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సదరు వ్యక్తికి గతంలోనే పెళ్ళయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం అక్బర్ షా పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సోషల్ మీడియాతో జాగ్రత్త, కొత్త వారితో పరిచయాలు ప్రమాదకరం:
ఇటీవల కాలంలో ఆన్ లైన్ ప్రేమలు ఎక్కువైపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా పరిచయం.. ఆ తర్వాత మాటలు కలవడం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం.. చివరికి నట్టేట మునిగిపోవడం. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు టార్గెట్ గా కొందరు నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని వదిలేస్తున్నారు. ఇలాంటి స్నేహాల జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, కొత్త వారితో పరిచయాలు వద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా కొంతమంది అడ్డంగా బుక్కవుతూనే ఉన్నారు.

Read Here>> ఛీ..ఛీ..వీడు తండ్రేనా..కన్నకూతురిని తల్లిని చేశాడు