Woman Ties Rakhi Martyred Brother Statue : దేశసేవలో ప్రాణాలు అర్పించిన వీరుడి విగ్రహానికి రాఖీ కట్టిన మహిళ

దేశసేవలో ప్రాణాలు అర్పించిన సోదరుడు విగ్రహానికి రాఖీ కట్టింది ఓ మహిళ. సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా.

Woman ties rakhi on martyred brother statue : రక్షా బంధన్..సోదరులు క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని సోదరీమణులు రాఖీ కడుతుంటారు. అన్నా చెల్లెలు..అక్కా తమ్ముడి అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ కేవలం వేడుక కోసమో..లేదా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటానికో కాదు. రక్షా బంధన్ అనే సంప్రదాయం సోదరుల సుఖసంతోషాలతో ఉండాలనే ఆకాంక్షే కాదు..అంతకు మించి అనిపిస్తుంది ఓ మహిళ మిలటరీ దుస్తుల్లో తుపాకీ చేత పట్టిన ఓ వీరుడు విగ్రహానిక రాఖీకట్టిన దశ్యం చూస్తే.

నిజమే కదా..దేశ ప్రజలు ప్రాణాలతో..హాయిగా జీవిస్తున్నారు అంటే దారికి కారణం గడ్డ కట్టే మంచులో..ఎర్రగా మండిపోయే ఇసుక ఎడారుల్లో..కష్టమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో రక్షణ కవచంగా కావలి కాసే జవానులే. వారికి  ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..?దేశ కోసం తమ ప్రాణాలకు సైతం తృణ ప్రాయంగా అర్పించే సైనికుల రుణం తీర్చుకోగలమా?అటువంటి వీరులకు ఎన్ని రాఖీలు కట్టే భాగ్యం వస్తే అంతకంటే కావాల్సిందేముంది? అంతకంటే సోదరప్రేమను చాటుకోవటానికి ఇంకేం కావాలి..? ఓ దేశ భక్తుడికి రాఖీ కడితే ఆ ఆడబిడ్డ జన్మ ధన్యమైనట్లే కదా..రక్షా బంధన్ వేడుకలకు అసలైన అర్థం పరమార్థం అదే కదా అనేలా ఓ మహిళ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ వీరుడి విగ్రహానికి రాఖీ కట్టిన దృశ్యం ఈ రాఖీ పండుగకు అసలైన నిర్వచనం చెప్పేలా ఉంది…ఎవరా వీరుడు? ఏమా త్యాగం వెనుక ఉన్న మొక్కవోని దేశ భక్తి గురించి తెలుసుకుందాం..

సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా. దేశసేవలో ప్రాణాలు అర్పించిన కద్వాస్రా వీరత్వానికి గుర్తుగా రాజస్థాన్‌లో విగ్రహం ఏర్పాటు చేశారు. షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా విగ్రహానికి ఓ మహిళ రాఖీ కట్టి..చూసేవారికి మరోసారి భావోద్వేగాన్ని కలిగించింది.

‘ఇలాంటి సన్నివేశాలే భారత్‌ను అసాధారణంగా మారుస్తాయి. సోదరుడిని కోల్పోయిన బాధ, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వం ఆమెను ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేనున్నాంటూ భరోసా ఇచ్చే ఆ సోదరుడి చేతికి రాఖీ కట్టలేక ఆమె మనసు అలజడికి గురైంది. తనను తాను నియంత్రించుకుని విగ్రహ రూపంలో నిలిచిన అతడి చేతికే రాఖీ కట్టింది. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా జాట్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించారు. 24-09-2017న జమ్మూకశ్మీర్‌లో విధి నిర్వహణలో అమరుడయ్యారు’ అంటూ వేదాంత్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది చదివిన నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశసేవ చేస్తోన్న సైనికులకు సలాం కొట్టారు.

ట్రెండింగ్ వార్తలు