Yamuna River Floods : ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

yamuna River Floods ..risk for Delhi : ఇటీవల ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునానది నీటి ప్రవాహం 205.99 మీటర్లకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

దేశ రాజధాని నగరం నడిబొడ్డునుంచి వెళ్లే యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు నదిలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. ముఖ్యంగా హరియాణాలోని యమునా నగర్‌ బ్యారేజీ వద్ద లక్ష్య క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

యమునా నది ప్రవాహం శనివారం (8,13,2022)ఉదయానికి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఢిల్లీ నీటి పర్యవేక్షణ అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. కానీ అధికారుల అంచనాకు ముందే యమునానది నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి నదీ ప్రవాహం గరిష్ఠ స్థాయి (205.33) దాటి 205.38మీటర్లకు పెరిగింది. దీంతో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. వరద ముప్పు పొంచివున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నదీ ప్రవాహం 206 మీటర్ల మార్కును దాటగానే ప్రజలను తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు