yoga trainer get a chance china instructor : బాధ తగ్గించుకోటానికి నేర్చుకున్న యోగ…విదేశీయోగాన్నిచ్చింది

సమస్య తగ్గించుకునేందుకు యోగా మొదలెట్టింది... అదే ఇప్పుడు చైనా వెళ్ళే యోగం తెచ్చిపెట్టింది... ఆమెకు వచ్చిన సమస్యతో పాఠాలు నేర్చుకుంది.. ఆ సమస్యే ఆమెకు ఉపాధి కల్పించింది. అదే సమస్యతోనే ప్రపంచ దేశాల్లో వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

Yoga Instructuor

yoga trainer get a chance china instructor : సమస్య తగ్గించుకునేందుకు యోగా మొదలెట్టింది… అదే ఇప్పుడు చైనా వెళ్ళే యోగం తెచ్చిపెట్టింది… ఆమెకు వచ్చిన సమస్యతో పాఠాలు నేర్చుకుంది.. ఆ సమస్యే ఆమెకు ఉపాధి కల్పించింది. అదే సమస్యతోనే ప్రపంచ దేశాల్లో వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి మొదటి మహిళా యోగా ట్రైనర్‌గా చైనాకు ఎంపికవ్వడం జీవితంలో మరిచిపోలేనని ఆమె అన్నారు.

అనకాపల్లి మండలం, తుమ్మపాలగ్రామానికి చెందిన విజ్ఞేశ్వరరావు, అమ్మాజీల రెండో సంతానం కరణం దేవిక. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ యోగా శిక్షకురాలిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ యోగాతోపాటు పలు యోగాల్లో శిక్షణ ఇస్తోంది.

సాధన ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దేవిక నిరూపించింది. యోగా గురువు బాబూరావుతో ఆమెకు వివాహం అయింది. ఆమెకు డెలివరీ సమయంలో ఆపరేషన్ జరిగింది. దాంతో కొన్ని నెలలు విపరీతమైన వెన్ను నొప్పికి గురైంది. అప్పటి వరకు యోగా గురించి ఏమీ తెలియని దేవిక భర్త ఆధ్వర్యంలో వెన్ను నొప్పి నివారణకు యోగా వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత యోగా ఆమె జీవితంలో భాగమైంది.